Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలలోనైనా కలకనలేదు మన కలయిక
కను రెప్పల్లో కంట నీరు మిగుల్చుతుందని
ఊహలోనైనా ఊహించలేదు
మన ప్రేమ తీరని ఆవేదనలా మిగిలిపోతుందని
భయంతోనైనా భ్రమించలేదు
నీ ప్రేమ లేక నా మనసు ముక్కలైపోతుందని
అనుకోలేదెప్పుడు చావంటు లేని నా ప్రేమ
చితి వరకు చేరుతుందని
వినిపించలేదా నా గుండె చప్పుడు వేగం
మన ప్రేమ బ్రతకాలని ఆశిస్తుందని
విరుగుడే లేని మన వీర ప్రేమ
విరహ వేదనలా మిగిలిపోతుందని
అందమైన మంచు గడ్డలా ఉండే మన ప్రేమ
నీరులా మారి మన నుండి దూరంగా వెళ్లిపోతుంది
అంతం లేని మన అనంతమైన ప్రేమ
చరిత్రలో ఒక కథలా మిగిలిపోతుందని
నా ఎద ఎంతో బాధపడుతుంది ప్రియతమా
- లడె.నిత్య ,
ఐఐఐటీ బాసర