Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా చూపుల బాణాలకు
నీ చిరునవ్వుల తోరణాలకు
నీ సొగసుల హొయలకు
నా కుర్రకారు వయసుకు
నీ చరణపాద పద్మములకు
అది స్పశించే గడ్డిపూలకు
అర్ధనిమిలిత నేత్రాల చూపులకు
నాలో చేలరేగే ప్రేమకైపుకు
నీ నిర్లక్ష్య నిర్మల ధోరణికి
నా గుండె గూట్లోని ప్రేమసరణికి
మధ్య ఎపుడు నిశ్శబ్దసమరమే..
సిగ్గుతో మాటలు రాక హదయాన్ని
తడిమిచూసుకునే వేళ
హర్షాతీరేకాల మధ్య కన్నుల్లో
ఆనందప్రవాహం కన్నీళ్ళరూపంలో
సాగే సందర్భాన
రెండు అహంకార పర్వతాల నడుమ
ఆత్మాభిమానం దెబ్బతిన్నవేళ
వాటిమధ్య మౌన జగడమే..
హదయపోరాట రణరంగంలో
సంఘర్షణ లేని చోట ఆకర్షణ,
ప్రేమాభిమానాలు కూడా లేవు
సమరంలేనిచోట జీవనం సంతోషాల
సాగరతీరం కూడా చేరదు
ఆకర్షణలేని జీవితం సౌగంధమే లేని
పుష్పం లాంటిది అది పచ్చని
వసంతంలేని పూలవనంలాంటిది..
- సర్ఫరాజ్ అన్వర్,
9440981198