Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందమైన చిలకమ్మను చూడాలని ఉంది
మధురమైన నా ప్రేమను తెలపాలని ఉంది
నా ఎదలో బంధీఐన యువరాణి తానేగా
తన మనసుని వీరుడిలా గెలవాలని ఉంది
సుందరమైన అందాలను తనుఎన్నో చూసినా
హదయంలో నా బొమ్మని గీయాలని ఉంది
తనతోటి రోజాపూలు సరితూగ గలుగుతాయ
వదనంలో సింధూరంగా మారాలని ఉంది
మాటలతో ప్రాణానికి ఊపిరిని అందించిన
తనకోసం ఏదైనా చెయ్యాలని ఉంది
సప్తస్వరాలను ఒకటిచేసి జగమంతా తెలిసేలా
ప్రేమపాట తనకోసం పాడాలని ఉంది
తనచూపుకు దూరమైన రోజులెన్నొ ఓ ' కార్తిక్ '
నేడు చెలియ గుండెగూటికి చేరాలని ఉంది
-జోడు కార్తిక్ 9390617667