Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక్క క్షణం....నువ్వు నా కంట పడిన ఆ క్షణం.
ఒక్క క్షణం....నీతో మాట కలిపిన ఆ క్షణం.
ఒక్క క్షణం....నువ్వు నా వంక చూసిన ఆ క్షణం.
ఒక్క క్షణం....నేను నీకై ఎదురుచూస్తున్నాను ప్రతీ క్షణం.
నీతో గడిపిన ఇన్ని క్షణాలు సులువుగా మాయమైపోతే,
నువ్వు నాతో లేని ఈ క్షణాలు యుగాలై నన్ను వేదిస్తున్న క్షణం, ఈ క్షణం.
నా అడుగులు మళ్లీ నీ వెంట నడిచే ఆ క్షణం కోసం,
నా కన్నులు నిన్ను మళ్లీ చూసే ఆ క్షణం కోసం,
నా పలుకులు నీ మనసును తాకే ఆ క్షణం కోసం,
నా మనసు నీ పలుకులు వినే ఆ క్షణం కోసం,
ఈ క్షణం....నా నిరీక్షణం.
- సుద్దాల మైథిలి,
ట్రిపుల్ఐటీ బాసర