Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా హృదయ స్పందనవి
నా ఊపిరివి
నా గొంతువింటే చాలు
నా బాధను గుర్తుపట్టే
మనో వైద్యురాలివి
నాలోని ఆత్మ విశ్వాసానివి
నా సంతోషంలోనే కాదు
నా బాధలోనూ
వెన్నంటి ఉండే నేస్తానివి
స్నేహానికి నిజమైన అర్థానివి
నీతో మాట్లాడుతూంటే
నన్ను నేనే
మార్చి పోయేలా చేసే
మైత్రీ మంత్రానివి
నాలోని కన్నీళ్లకు
ఔషధమయ్యే ఓదార్పువి..
ఎంత ఎదిగినా
ఒదిగి ఉండాలని
మంచిచెడు విడకూడదని
ధైర్యాన్ని నూరిపోస్తావు..
ఎవరు వద్దన్నా
నా స్నేహనికే విలువ యిస్తావు..
ఏమిచ్చినా నీ ఋణం
తీర్చుకోలేను..
కాలేజి మెట్ల మీద మొదలైన
మన స్నేహం
ఎప్పడికీ ఇలాగే
కొనసాగాలని కోరుకుంటూ...
- అనిత దావత్
9394221927
హైదరాబాద్