Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎడబాటు నా ఎదను చీరడం కోసమే
నీ రాక నా మదిని దోచడం కోసమే
ఆ నీలి కురులతో మాయనే చేస్తావె
నీ వలపు ఎద లయను ఆపడం కోసమే
దేవతవి కాదుగా, నా తప్పు ఏమిటో
నీ అలుక నన్న ఖైదు చేయడం కోసమే
ఇప్పుడే నా కనులలో మెరుపొకటి గుచ్చింది
ఇది అంత నా తనువు చీల్చడం కోసమే
బ్రతుకులో బాధలే నిండుగా ఉండేది
నిన్ను మేటి మనిషిగా మార్చడం కోసమే
- ఇనుగుర్తి లక్ష్మణాచారి
9441002256