Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోస్ట్ లనే పిలుపుతో
నా కళ్ళల్లో చెమ్మగిల్లిన తడి
గత జ్ఞాపకాలను తడుముకుంటుంటే
అలనాటి మధుర స్మతులను
నెమరు వేసుకుంటుంటే
యెన్ని అనుభూతుల్లో ఆ అక్షరాలకి
ఎంత మమకరమో ఆ అనుభవాలకి
ఎన్నాలైయిందో...
ఆ చెలిమి ఊట వూరక
వేచి వేచి అలసి పోయిన
ఈ ఎదకి..
ఆ పిలుపుతో
ప్రాణం లేచి వచ్చినట్లయింది
ఏముంటాయి.. ఆ ఉత్తరంలో
ఇన్సూరెన్సు పాలసీలు - లోన్ రికవరీ నోటీసులు
క్రెడిట్ కార్డ్ బిల్లులు - చిట్ ఫండ్ లేఖలు
మళ్ళీ..మళ్ళీ...మళ్ళీ
శిశిరంలో రాలిపోయి
వసంతములో చిగురులు
తొడిగే ఆకులా...
ఆ ఉత్తరం కోసం.. ఆనాటి రోజుల కోసం
అలనాటి స్నేహపు తీపి గుర్తుల కోసం
ఎవరన్నా బాగున్నావా మిత్రమా!
అని...
ఆ నల్లని సిరా చుక్కలతో..
శ్రావణ మేఘంలా..
ఈ గుండెను
పలుకరిస్తారన్నా ఆశతో
ఈ మనస్సులో ఇప్పటికి ఇంకా
ఎదురుచూపులే..
ఎప్పటికి తీరేను ఈ దాహం!
ఏనాటికి నెరవేరును .. ఈ స్వప్నం!!
మనిషి అంతరంగంలో
మానవత్వ పరిమళాలు వెదజల్లి
మంచి చెడులను బేరీజు వేసే ..
ఆ ఉత్తరానికి.. ర్కెలొచ్చి
కాలం ఒడిలో జాలువారే
ఘడియ కోసమే..
ఈ అశ్రువులా అక్షరాలా అభిషేకం
కావాలి ఒక మేలుకొలుపు
ఈనాటి రేపటి తరాలకు...
- రవీందర్ కొండ్
అల్వాల్, హైదరాబాద్
9848408612