Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిను చూడాలని ఆశ
మనసును ముందుకు నెట్టింది
ఒక్క క్షణంలో బోర్లాపడి
తలెత్తి చూసేలోగా
దూరమై వెక్కిరించావు
మూట కట్టిన కలను
నీ చేత ముడి విప్పిదీనుంచి
నీ కళ్ళలో నన్ను చూసుకోవాలని కోరిక
కానీజి
నన్ను నాకు పీటముడి వేసావు.
రాత్రంతా మనసులో
మన కలల చిత్రం గీసాను
రంగులద్దే వేళకు
నీవు ఏడ్పించి
కుంచె జారి
కన్నీరును ముద్రించింది.
దగ్గరగా వచ్చి దూరంగా కనిపించి
గుండెలో కొండలా పేలావు
రాలిపడ్డ ప్రతి శకలంలోనూ కనిపించి
మనసును చిదిమేవు.
ఎంత చెప్పినా....ఎంత చూసినా.....
నాలో ఏదో ఒక బాధ నీవు..
చంపుకోలేని నిజాన్ని చాటే
రోజు ఒకటి మనకు లేని లోటు
ఎవరు తీరుస్తారు?
మనసంతా స్వారీ చేస్తావు
మనిషిని గుల్లవుతాను
మర్యాదకి కూడా దగ్గరకాలేవు
పొరపాటున కూడా దూరం కాలేను.
ప్రియతమా!
గాయమైన నా మనసుకు
నీ మాటే మందు.
ప్రాణమైన నా జీవితానికి
నీ ప్రేమే ఊపిరి.
నిత్యం నా గుండె చప్పుడవు నీవు.
జీవితమంతా నీ ధ్యాసే నాకు శ్వాస.
- చందలూరి నారాయణరావు
9704437247