Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ ప్రియతమా!
నీవు ప్రక్కన లేని ఒక్క రోజు
ఒక పూవు అడిగింది.
నా అవసరం యిప్పుడేందుకని?
ఓ పాట నిలదీసింది
నా హాయి అవసరమేమని?
ఓ రాత్రి ఆశర్యపడింది.
ఈనాటి కలను ఏమిచేస్తావని?
ఒక రోజు నీవు దూరమైతే
ఇన్ని ప్రశ్నలా?
ఇన్ని అనుమానాలా?
ఇంత అవమానమా?
ఇక తట్టుకోలేను
తల్లడిల్లుతున్నజి
ఎప్పుడు భరింపలేను
ఎడబాటును
క్షమించు కరుణించి
రక్షించు క్షమించి
నీ ఒడిని వీడితే
లోకం ఎంత భయానకమా?
నీవు దూరమైతే
ఇంత లోపమా?
- సాహితి
83094 63567