Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరుణలేని కర్కోటకుల
మగవాంఛతో
కన్ను మూసింది మరో అబల
మార్పురాదేమోజి
ఈ మగ జాతిలో
మరణాన్ని చేరేవరకు
ఓ మగువా!
అగ్నిశిఖలా ఎగిసిపడి
ఆడతనపు హక్కులను
కాలరాచే కామాంధులను
బూడిదచేయి..
అడుగడుగునా
పొంచిఉన్న
''మదపుపురుగుల్ని''
ఏరి పారేయి
ఆశయం నీ సొత్తుగా నీవుంటే
నీవు వేసే ప్రతి అడుగులో
మరో వేయి అడుగులు నీ వెంటే...
- వేమూరి శ్రీనివాస్
9912128967