Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ముసుగులు సమసి
పోయేదెప్పుడు
స్వచ్ఛా గాలులతో మన
మనోమస్తిస్కం వికసించేదెపుడు
నిండారా నవ్వులు ముఖం
చెట్టుకి పూచి గుబాళించేదెప్పుడు
మాస్కుల్లో ఊపిరాడక అచేత
నావస్థల్లో దాక్కొన్న హావభావాలు
తెప్పరిల్లి తేటపడే దెప్పుడు
జనసందోహాలు విందులు వినోదాలు
మళ్ళీ కళకళ్ళాడే దెప్పుడు
ఇన్నాళ్లూ మన నవనాడుల్నీ
క్రుంగదీసిన భయం నీడలో.. మళ్ళీ
కాంతిపుంజాలు మొలకలెత్తేదెపుడు
ఇన్నాళ్ల త్యాగఫలం సహనఫలం
పక్వానికొచ్చి..
నరుడి జీవనం మళ్ళీ
నిట్రాడిలా నాట్యమాడేదెప్పుడు!?
ఆ ఔషధం రెక్కలు కట్టుకుని
వచ్చి వాలేదెప్పుడు
కరోనాని అంతం చేసి ఈ
దాగుడు మూతల కల్మషాలన్నిటినీ
కడిగి పారేసి కలలు నిజం
చేసేదెపుడు.. ఎపుడు..?!
భీమవరపు పురుషోత్తం
9949800253