Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలుష్యపు వలయంలో
చిక్కబడిన ప్రకృతి ముడి
విప్పడానికి చేతులు కదపాలి
మానవ మనుగడ
పర్యావరణంతో ముడిపడినాక
చెట్టు పోషణకై మనిషి
చేయూతనివ్వాలి
ఓజోన్ పొర దేహానికి
చిల్లులు పడకూడదంటే
వాతావరణానికి పట్టిన
ధూళి బూజును దులిపేయాలి
ఏరువాక పౌర్ణమిలా
పచ్చదనపు వెలుగులు
పుడమి మొత్తం పరుచుకోవాలంటే
మొక్కలతో నేల నిండిపోవాలి
శబ్ద వాయు కాలుష్యానికి
చరమగీతం పాడినాక
వనాల స్వేచ్ఛకు జెండా ఊపాలి
జనాల బతుకులో
సిరులు మొగ్గలై తొడగాలి
ఇంటికో మొలక
చెట్టుగా ఎదిగితే
ఆరోగ్య రక్షణా దీపికలు
నట్టింట్లో వెలుగై నిండాలి
పర్యావరణ పరిరక్షణకై
పరితపించే మనసుకు మనమే
శ్రీకారం చుట్టుకోవాలి
పంఛభూతాల నిలకడ కోసం
జీవన విధాన వన్నెత కోసం
చెట్టును సంరక్షించాలి
కాలుష్యాన్ని అరికట్టాలి
నరెద్దుల రాజారెడ్డి
9666016636