Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గురుని రాకతో
నదులకుపుష్కరాలొచ్చినట్లు
కాలం పోకడతో
పలు రకాల ఎన్నికలోస్తాయి
పుష్కరస్నానం పొకపోతే
పోయేదేమీ లేదు
ఓటేయ్యక పోతేనే
ఓసారి ఒలికిపోతుంది
ఓటుహక్కు...
హక్కులు కోల్పోతే
బానిసలై బతకాలి
బానిస బతుకులోద్దు
బతుకు బాగుకోసంఓటెద్దా
బతికే ఉన్నానని చాటెద్దా
గెలిచినోళ్ళు
ఎన్నుకున్నొల్లను
ఎడ్డోల్లనుజేసిపార్టీ ఫిరాయిస్తే
ఓటుకు విలువేమున్నది
ఎన్నికల ఫలితమేమున్నది
ఇది..... ఇలాగే సాగితే
ఇంకెన్నాళ్ళుంటుంది
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం
ప్రజలారా ఆలోచించండి
నడుస్తున్నది
నడవనున్నది
ప్రజాస్వామ్యమేనా?
పార్టీ ఫిరాయింపులపై
విచక్షణాధికారాలోద్దు
తక్షణశిక్షలే రావాలి
పోటీనే తిరస్కరించాలి
చట్టాలనిలా సంస్కరిచాలి
సంస్కరణ కోరే
సంస్కారవంతులారా
భాగ్యనగరం బాగుకై
బల్దియా ఎన్నికల్లో ఓటేద్దా
జినుకల వెంకటేష్
కరీంనగర్, 9652092120