Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె చిరు దరహాసాలు చిలిపి సరసాలు
అప్పుడప్పుడు నన్ను పలకరించి పోతుంటాయి
నన్ను తీయని జ్ఞాపకాలుగా
నా చెవులు మాత్రమే వింటూంటాయి
నాలో ఊపిరి నింపే ఆమె శ్వాసల సరిగమలు
ఆమె నన్ను పలకరిస్తుంది
కనిపించే కమ్మని అక్షరమై
కనింపించని మధురమైన భావమై
ఏమి పట్టుకు పోలేదు ఆమె
పంచి పోయింది అన్ని నాకే
పైగా వుంచి పోయింది తన అందమైన
జ్ఞాపకాలను నా మదిలో శాశ్వతంగా
మాటలు కరువైనవి ఆమె ధ్యాసలో
ప్రేమ పదును ఎక్కువైందో ఏమో
ఆమె పెదాలపై పూసే చిరునవ్వుల మొగ్గలు
నా ఎదలో పూలై వికసిస్తాయి
పరిమాలాలు వెదజల్లుతు
మనసు ఆరాటం ఏదో చెప్పాలని
కాని ఇంకా అవ్యక్తమే నా మనసాక్షరాలు
నేనే ఓ పుస్తకమైతే
అందులోని అందమైన పదాలు
ఆనంతమైన భావాలు అన్ని ఆమెవే
తానే నా సర్వస్వం
తానే నా జీవిథం
వేణు దుర్గం