Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజ్ఞాన వీచికలు పంచే
అక్షరప్రేమికుల పుణ్యస్థలమై
జనులను మేల్కొలిపే
జాగతి జ్యోతిగా
స్వేచ్ఛా సమరసమయాన
సాంఘిక ఉద్యమాల వ్యూహ
నిర్మాణస్థావరమైన
చైతన్య స్రవంతి
సాహితీచర్చల
చిరునామాగా నిలిచి
సాహిత్యామతాన్ని పంచే
అక్షరహాలికుల
సాహితీ సేద్యానికి
మేధో స్వేదమై
చరిత్రకు ప్రత్యక్షసాక్షిగా
శతాబ్దాల
సారస్వత పెన్నిధిని
ఇముడ్చుకొని
తరాల వికాస క్రమాన్ని
తెలియచేసేదై
పాఠక,పరిశోధకుల
ఎరుక దప్పికలు తీర్చే
సజీవనది పగిది
అక్షరాంబుధిని మధించే
శోధకులకు
నిధినిక్షేపాలు పంచే
జ్ఞాననిధుల భాండాగారం
అదే అదే...
మన గ్రంధాలయం
- వేమూరి శ్రీనివాస్ 9912128967 తాడేపల్లిగూడెం