Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తారలా తళుక్కున మెరిసింది
నా ఎదలో పిడుగు లా సర్రున దిగింది
ప్రేమ వేణువును ఊది
మనసు గిటారును తట్టి లేపింది
పచ్చి కొమ్మను మెలిపెట్టినట్లు
నా మనసు ను మెలిపెట్టి
నిశ్శబ్ద నా మనసు కడలిలో
అలల పోటులను రేపింది
కోరచూపులతో ఓరగా చూసి
ఇష్క్ బాణం తో గుండె లో గుచ్చింది
నిరాశల సముద్రంలో
నిట్టూర్పు ల సుడిగుండంలో
దారం తెగిన గాలిపటంలా దరులు
వెతుకుతుంటే
నా ఆత్మీయతా నావలోకి చేరి
చుక్కానిగా మారింది
మోడు బారిన తనువుకు
మమతల ఎరువును వేసి
కొత్త ఆశల మొలకలు మొలిపించింది
మాట మాట కలిపింది
ప్రణయ గీతాలు పాడింది
అడుగు లో అడుగు వేసి
సప్త పదులు నడిచింది
సంతోషాల సాగరం తో
నా ఇంటిని నందనం చేసింది
ఎండిన ఎడారి జీవితాన్ని
ఒయాసిస్సు లా మార్చింది.
- తాటిపాముల రమేష్
శివనగర్, వరంగల్
7981566031