Authorization
Mon Jan 19, 2015 06:51 pm
త్యాగాలు మరచి
భోగాలను వలచి
విలువల వలువలొలచి
తప్పని చావుకై
కాలంతో తిప్పలకై
తప్పుడుతోవలో బతుకెందుకు
ఎప్పుడు పోతుందోతెలియని
మొసకోసం
మితిమీరిన మోసాలేందుకు
ఉన్నంతకాలం
ఊపిరి ఉన్నతకాలం
ఉన్నతంగా బతికెద్దాం
అవినీతి అక్రమార్జనతో
భూదందాల బరితెగింపుతో
తరతరాలకు తరగకుండా
కొల్లగొట్టి కూడబెట్టిన
కోట్లకొలది దోపిడిసంపదలొద్దు
తనకు తానే తరలిపోయే
జ్ఞానసంపదనేముందుతరాలకివ్వాలి
-జినుకల వెంకటేష్
9652092120