Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆయన దేశానికే వెన్నముక
ఆ దేహానికి కష్టపడడమే ఇష్టం
ఆకలితీర్చడమే ఆయన పని
నష్టాలెన్నెదురైనా నడక ఆపడు
అతివష్టి అనావష్టి వెంటాడిన
తట్టుకుని నెట్టుకురావడమే తెలుసాయనకు
అహర్నిశలు అహంలేకుండా మట్టితో చుట్టరికం చేస్తడు
ఉన్నంతలో ఉన్నతంగా జీవించగల మహౌన్నతుడు
తను తప్పుచేయడు చేస్తే తనకోసం అప్పుచేస్తాడు
అప్పులు కుప్పలు తిప్పలెట్టిని
ఓర్పుతో నేర్పుగా సాగుతాడు
వనరులు లేకున్నా
పరుల సంపదను ఆశించడు
కరువులెన్ని తరిమినా పరువుగా బతుకెల్లదీస్తడు
ఉరుములెన్ని ఉరిమినా మెరుపులా తరుముతాడు
హలానికి తన బలాన్నిచ్చి
భూమాతను సస్యశ్యామలం చేస్తడు
దళారులు ధగా చేసినా
తెలియనితనంతో పసిబాలడౌతాడు
తన నెత్తురంతా చెమటగా మార్చి క్షుద్భాదలను తీర్చే దేవునిరూపం హాలికుడు
రైతుకు నష్టపరిచే చట్టాలను ఆపేద్దాం
పంటచేలే లోకమై తిరిగే రైతులను అక్కడే ఉండనిద్దాం
- సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.