Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మౌనంగా కంటనీరు కారడమూ గుర్తున్నది
ఎదలోనికి ప్రేమఋతువు రావడమూ గుర్తున్నది
అలుపులేని మరుపురాని ఆశలెన్నొ విరిసినాయి
తొలిరోజున ఎదలురెండు కలవడమూ గుర్తున్నది
మనమధ్యలొ మొహమాటపు పరదాలను లాగేసెరు
దుపట్టాతొ నీ ముఖమును దాచడమూ గుర్తున్నది
పదేపదే ప్రేమచూపు కోసమనీ ఎగరడమే
కిటికినుండి నువ్వు నన్ను చూడడమూ గుర్తున్నది
చూపులలో దొంగలలా కలవడమే ఇప్పటికీ
నేను వెళ్ళుతుంటె నువ్వు పిలవడమూ గుర్తున్నది
- ఇనుగుర్తి లక్ష్మణాచారి
9441002256