Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తారలరాణీ రావేచెంతకు తళుకుతానాలు చేయిస్తానే
మౌనగాయనీ చేరవెచెంతకు ప్రణయరాగాలు పలికిస్తానే
శూన్యము విడిచి ఎదలో వాలిపొ నారధమహతిని ఎత్తుకువచ్చీ
చుట్టూ తిరుగుతు రేయింబవళ్లు మధురనాదాలు వినిపిస్తానే
నిన్ను కొలిచేటి పోలిక కోసం విశ్వమంతటిని తవ్వేస్తూనే
కాళిదాసకవి ఈర్ష్యపడేలా పద్యపాదాలు రచియిస్తానే
నా కలములోని అమతసిరాను నీ స్వరములో కొంత పోసేసి
వసంతానికే చిగురులుతొడిగే వలపుగానాలు పాడిస్తానే
లక్ష్మణ కలముకు ఇంధనమిస్తే ఇదిగో ఇపుడే యమునిచెవుల్లో
పువ్వులుపెట్టి నీతో గడుపుతు మూడుకాలాలు ఆపేస్తానే
- ఇనుగుర్తి లక్ష్మణాచారి
94410 02256