Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక పులి; కొన్ని మేకలు-
పులి పంతం పులిది
మేకల కేకలు మేకలవి-
అమాయక మేకలు పులికి సరిపోవు; అయితే?
పోరాటానికి శెలవా?
దినాలు వారాలు నెలలు గడిచి
పరిస్థితులు అనుకూలించని వేళలో
పులి విసిగిపోయింది
మేకలు అలిసిపోతున్నారు-
ఈ జగత్తులో అన్ని జీవులకి
నివసించే హక్కువుంది-
వేటలో వేటగాళ్ళ చేతిలో
కొన్ని ప్రాణాలు పోతాయి; అయితే?
పోరులేదా?
మేకలు మేకలే; గొర్రెలు కావు-
దాపుగా ఉండమంటే
చాటుగా బతకమంటే ఎలా?
కోరికలంటూ పండగలంటూ
వలయం దాటి వస్తున్నాయని
పులిగుర్రు-
కుళ్ళిందో పాసిందో తిని బతికే మేకలు
మార్పును కోరవద్దా?
అదిలింపులు
బెదిరింపులు పులి లక్షణం-
వెన్నలీయకుండా చుకల్ని మేఘాల్తో కప్పేసే కుట్ర-
వర్షించకుండా మేఘాల్ని గాలికెరటాల్తో దాటేసే కుతంత్రం-
నిరాధార నిందలమధ్య
గుండె నలిపే మాటలమధ్య
మేకలు క్రుశించి నశించి-
దూడల్ని తోడేలు లాక్కుపోతున్న దృశ్యం బాగుందా?
కోడిపిల్లల్ని గద్ద ఎత్తుకుపోతున్న చిత్రం బాగుందా?
రాతలు మారుతాయనుకుంటే
వాతలు శరీరాల్లో రక్తమోడ్తూ-
సంపూర్ణయుద్ధంలో సమిధలు ఆరిపోతున్నాయి;
జాలి జాడలు!
పొత్తుకి
కొండలు కోనలు ఎదురుచూస్తున్నాయి
ఊర్లు వాడలు నిదురకాస్తున్నాయి
మఠాధిపతులారా పీఠాధిపతులారా
పులికి మీరైనా చెప్పరా?
- కోటం చంద్రశేఖర్
9492043348