Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నప్పట్నుంచీ సినిమాలంటే ప్రాణం... పెద్దయ్యాక ఆ కలల రంగంలో స్థిరపడాలనుకున్నాడు... కానీ ఇంజినీరింగ్‌లో చేరాల్సి వచ్చింది... మనసుకు నచ్చని పని చేస్తే అందులో సక్సెస్ కాలేనని అతడికర్థమైంది...అతికష్టం మీద బిటెక్ పూర్తి చేశాడు. తన సినిమా కల కలగానే మిగిలిపోకుండా తనికేళ్ల భరణి లాంటి అగ్ర నటులతో వెండితెరని పంచుకొని ఎందరో మహానుభావులు, బ్లాక్ బోర్డు వంటి సినిమాలకి దర్శకత్వం చేస్తూ,హీరోగా,విలన్‌గా తనని తాను ప్రూ చేసుకుంటూ.. అన్నింట విజయకేతనం ఎగరవేస్తూ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి ప్రముఖుల నుండి అవార్డులు అందుకున్న యువ దర్శకుడు, కథానాయకుడు తల్లాడ సాయికృష్ణ పరిచయ కథనమే ఈవారం ''జోష్''.
మీ జీవిత నేపథ్యం గురించి చెప్పండి..??
నా పేరు తల్లాడ సాయి కృష్ణ, అమ్మ శ్రీ లక్ష్మి, నాన్న శ్రీనివాస్, తమ్ముడు శ్రీ కౌశిక్. నేను పుట్టింది ఖమ్మం లోనే, కానీ 10వ తరగతి వరకు మాత్రం మహబూబాద్ జిల్లా దంతాలపల్లిలో ''సర్వేపల్లి గురుకుల విద్యాలయం''లో చదివాను. ఆ తర్వాత చదువంతా ఖమ్మం న్యూ జనరేషన్ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్మీడియెట్, ఖమ్మం కిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో బి.టెక్(కంప్యూటర్ సైన్స్) కానీ చిన్నప్పటి నుండి ఇంటర్ వరకు తెలుగు మీడియం లో చదవడం వలన ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో మూడు సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాను. ఇంకా అప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్స్ గౌతమ్, శ్రీహరి, తారక్, జీవన్, క్రాంతి, సందీప్ వాళ్ళ సపోర్ట్‌తో పాటు మా కాలేజ్‌లో ఉన్న ఫ్యాకల్టీలు మా హెచ్.ఓ.డి సుదర్శన్ సార్, ఏ.ఓ శ్రీనివాస్(ఆర్.ఎన్) సార్, ఫీ.డి మూర్తి సార్, శశి సార్ల ప్రోత్సహంతో అడ్డంకులు పడకుండా బి.టెక్ పూర్తి చేసాను. ''కిట్స్'' కాలేజ్ నా కెరియర్ కి టర్నింగ్ పాయింట్ .
మీకు సినిమా ఫీల్డ్ లో కి రావాలి అని ఆసక్తి ఎలా కలిగింది...??
ఆసక్తి అంటూ ఏం లేదు, కానీ స్కూల్ లో ఉన్నప్పుడు కవిత్వాలు, చిన్నచిన్న కథలు రాస్తూ ఉండేవాడిని. స్కూల్ లో ఎబోవ్ యావరేజ్ స్టూడెంట్‌ని కానీ, కథలు, కవిత్వాలు రాయడం వలన టీచర్స్ దగ్గర నాకు మంచి క్రేజ్ ఉండేది. దాంతో పాటు మా ఇంట్లో మా అమ్మానాన్న కూడా నేను ఏదేనా క్రియేటివ్‌గా పని చేస్తే దానికి వాళ్ళు బాగా సపోర్ట్ చేసే వాళ్ళు, ఇంకా పొతే మా బాబారు తల్లాడ శ్యామ్ ఐతే నేను చేసే ప్రతి పనిలో లోపాలు ఉన్నా నా భుజం తట్టి ముందుకు నడిపించేవారు. హిందీ పరీక్షలో సగం సినిమా కథలే రాసేవాడిని. ఖాళీ దొరికితే స్కూల్ ఫ్రెండ్స్ రవివర్మ, హరీష్, ప్రవీణ్‌లతో నేను రాసుకున్న కథల్ని వినిపించేవాడ్ని. ఆ విధంగా నాకు తెలియకుండా నాలో సినిమా అనే అమతం ప్రవేశించింది. మాది కిరాణా షాప్. నేను టెన్త్‌లో ఉన్నప్పుడే కిరాణా షాపులో కూర్చోని న్యూస్ పేపర్లో సినిమా క్లాసిఫైడ్స్ చూసి కాయిన్ బాక్స్ నుండి ఫోన్ చేసి నాకు సినిమాలో ఛాన్స్ కావాలి సర్ అని అడిగేవాడ్ని. అలా రకరకాల ప్రయత్నాల తరువాత ఒక అతను హైదరాబాద్‌కి పిలిస్తే మా బాబారు శ్యామ్ నన్ను తీసుకొని వెళ్ళాడు. 10వ తరగతి పరీక్షలు అయ్యాక వస్తే ఫిల్మ్ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. అలా 2008లో 15000 తీసుకొని హైదరాబాద్ వెళ్ళగానే ఆ డైరెక్టర్ టీంతో వైజాగ్‌లోని పెందుర్తి గల సూర్య ఫిల్మ్ అకాడమీలో నాకు యాక్టింగ్డ డైరెక్షన్ ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ మాత్రం బాగా ఇచ్చారు కానీ సినిమా మాత్రం తియ్యలేదు. అప్పుడు అనుకున్నాను చదువుకుంటూ సినిమాలో ట్రై చేయాలని నిర్ణయించుకున్నాను. ఇంటర్ చదువుతున్నప్పుడు హాస్టల్ పక్కనే ఖమ్మం లకారం పార్క్ ఉండేది. అక్కడ రకరకాల వ్యక్తుల్ని, ప్రేమికుల్ని చూస్తూ వుండే వాళ్ళం. ఇంటర్ కాలేజ్ లోకేషన్స్ కూడా కొబ్బరి చెట్లతో ఆహ్లలందగా ఉండేది. కాలేజ్ లో రైటింగ్ కాంపిటీషన్ లో సైతం నాకు ప్రత్యేక బహుమతి రావడం తో నాలో తెలియని ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. హాస్టల్ లో ఎంసెట్ కోచింగ్ టైమ్ తీసుకుంటున్నప్పుడు నా ప్రెండ్స్ నాగరాజు, పవన్, శ్రీనులతో పాటు నా ఫ్యామిలీకి, మా టీచర్స్ కథలు చెప్పే వాడిని వాళ్ళు నాకు మంచి మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చేవారు. దీంతో ఫిక్స్ అయ్యా ఖచ్చితంగా భవిష్యత్‌లో డైరెక్టర్ కావాలని. నాకంటూ డిఫరెంట్ ఇమేజ్ ఉండాలి అనుకున్నా అలా సినిమా ఫీల్డ్ లోకి వచ్చాను.
దర్శకత్వ శాఖని ఎందుకు ఎంచుకున్నారు...??
నాకు లీడర్ షిప్ క్వాలిటీస్ అంటే చాలా ఇష్టం. ఒక సినిమా డైరెక్టర్ ని కెప్టెన్ ఆప్ ది షిప్ అంటారు కదా..!! అలానే సినిమాకి ముఖ్యమైన శాఖ ఇది. ఒక డైరెక్టర్ తన కలలో ఉన్న కళని ప్రేక్షకులకి చూపించడానికి ఎంతో కష్టపడతాడు. ఆ కష్టంలోనే కిక్ ఉంటుంది. అందులో ఒక విజన్ ఉంటుంది. డబ్బులు లేక పోయినా సరే ఒక ఆత్మస్థైర్యం వుంటుంది. హిట్ రాగానే ఈ డైరెక్టర్ మా వాడు అంటారు. ఫ్లాఫ్ పడగానే విడికేందుకు ఈ సినిమాలు అంటారు. ఇలాంటి సూటి పోటీ మాటలు అన్ని తట్టుకుంటూ తనని నమ్మిన ప్రొడ్యూసర్ కోసం, అనుకున్న కథని వెండితెరపై వచ్చేవరకు నిరంతర శ్రమ జీవి కేవలం దర్శకుడే. అది డైరెక్టర్ కి ఉన్న క్రేజ్, అందికే నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం.
డైరెక్షన్ చేయడమే కష్టం కదా! అలాంటిది మీరే డైరెక్టర్, మీరే హీరోగా ఎలా బ్యాలెన్స్ చేశారు?
'ఇల్లు కట్టి చూడు, పెండ్లి చేసి చూడు' అనే సామెత తరచు వింటుంటాం. వీటి తో పాటు ''సినిమా తీసి చూడు'' అనేది త్వరలో వింటారేమో. ఎందుకంటే ఒక పెండ్లి చెయ్యడానికో, ఇల్లు కట్టడానికో ఎంత టీం వర్క్ చేస్తారో అంతకంటే ఎక్కువ సినిమాకి టీం వర్క్ చేయాలి. సినిమాకి డైరెక్టర్ ఎంత ముఖ్యమో,హీరో కూడా అంతే ముఖ్యం. ఒక హీరో ఎలా చేయాలి, హీరోయిన్ ఎలా చేయాలి, రిమెయినింగ్ ఆర్టిస్ట్‌లు ఎలా నటించాలి అని చెప్పేది కేవలం డైరెక్టర్ మాత్రమే. అలాంటపుడు కథలో హీరోగా డైరెక్టర్ నటిస్తే అసలు ఇబ్బందే ఉండదు. అందుకే నేను ఎందరో మహానుభావులు సినిమాకి డైరెక్టర్ గా, హీరో గా చేశాను. బ్లాక్ బోర్డు సినిమాకి డైరెక్టర్ గా, హీరోగా, విలన్ గా త్రిపాత్రాభినయం చేశాను. అందరూ అది రిస్క్ కానీ నాకు మాత్రం ఇష్క్.
షార్ట్ ఫిలిమ్స్ ఏమైనా చేశారా?
ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ఏకత్రా అని ఫెస్ట్ నిర్వహించే వారు. అప్పుడు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూనే యాంకరింగ్ చేసే వాడిని. సుమారు 30 షార్ట్ ఫిలిమ్స్ తీశాను. ఒక రోజు జర్నలిస్టు జానీ ద్వారా ఖమ్మం సి.ఐ అంజలీ మేడమ్ పరిచయం అవ్వడంతో మేము ''ప్రెండ్లి పోలీస్'' అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్లో మాకు మూడో బహుమతి వచ్చింది. అక్కడితో ఇంకా మనకు జాబ్ లు సూట్ అవ్వవు అని ఇంకా 2016 మార్చి 15న మా అమ్మ పుట్టినరోజు సందర్భంగా శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ అనే ప్రొడక్షన్ సంస్థను స్థాపించి నాకు సపోర్ట్‌గా మా నాన్నే నిర్మాతగా మారి చేసిన మొదటి సినిమా ''ఎందరో మహానుభావులు''.
మరి సొంత బ్యానర్లో సినిమా తీయడం సాధ్యమైనదా..??
నిజం చెప్పాలి అంటే 30,40 లక్షలు ఉంటే మిడిల్ క్లాస్ అబ్బాయి పక్క అమెరికానో లేదంటే ఏదేనా బిజినెస్ ప్లాన్ చేస్తారు. కానీ సినిమా చేసి రిస్క్ మాత్రం ఎవరు చేయరు. నేను ఎందరో మహానుభావులు సినిమా చేస్తున్నప్పుడు నాకు మినిమిమ్ సినిమాకి ఎంత ఖర్చు అవుతుంది. అసలు మన లాంటి వాళ్ల సినిమా తీస్తే ప్రేక్షకులు చూస్తారా, రిటన్స్ ఏమైనా వస్తాయా అనేది కూడా మాకు తెలియదు. (కేవలం నేను తీస్తున్న సినిమా కి నిర్మాత గా ఉన్నందుకు కాదు,నేను ఇబ్బంది పడొద్దు అని ఏకంగా 63 లక్షలు పెట్టి నాకు ఫుల్ సపోర్ట్‌గా నిలబడి సక్సెస్ ఫుల్ గా 2018 ఏప్రిల్ 27 న సుమారు 30 థియేటర్లో సినిమా విడుదలైంది.) కానీ ఒక రూపాయి కూడా రిటన్స్ రాలేదు. దింతో కొంత నిరాశ. కానీ సినిమాపై గౌరవం పెరిగింది. ఇంట్లో రెండో సినిమాకి పెట్టుబడి పెట్టెంత పరిస్థితి లేదు. దీంతో స్నేహితులు సహాయంతో 'బ్లాక్ బోర్డ్' తీశాను. కారీ థియేటర్ మాఫియా ఉండటంతో అనేకరకాల ఇబ్బందులు పెట్టారు. చివరికి రీలీజ్‌కి కూడా ధియేటర్స్ ఇవ్వలేదు. చివరి ప్రయత్నంలో రెండు ధియేటర్స్‌లో రీలీజ్ చేశాం..
మీరు చేసిన సినిమాలు- అవార్డ్స్
నేను మొత్తం 50 షార్ట్ఫిలిమ్స్ దాకా డైరెక్టర్‌గా చేసాను. అందులో 2015లో ''ఫ్రెండ్లీ పోలీస్'' షార్ట్‌ఫిల్మ్‌కి మూడో బహుమతి రావడం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా అవార్డ్, 25 వేల చెక్ తీసుకున్నాను. 2017 లో స్వచ్ భారత్ షార్ట్‌ఫిల్మ్‌కి కేంద్ర ప్రభుత్వం తరపున కన్సోలేషన్ బహుమతి వచ్చింది. 2020 లో కరోనా నేపథ్యంలో రైతుల సమస్యల పై తీసిన ''మనోగతం'' షార్ట్‌ఫిల్మ్ కి రాష్ట్ర స్థాయి లో మూడో బహుమతి రావడం , ఈ అవార్డ్ ,50 వేల చెక్ ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా తీసుకున్నాను. ప్రతి ఫిల్మ్ మేకర్‌ను ఇలాంటి అవార్డులు మాత్రమే ముందుకు తీసుకుని వెళ్లేలా చేస్తాయి.
ఇంకా సినిమాల విషయానికి వస్తే..
ఎందరో మహానుభావులు, బ్లాక్ బోర్డు, ఈ రెండు సినిమాలు విడుదల అయ్యాయి. నరుడి బ్రతుకు నటన సినిమా షూటింగ్ పూర్తి చేసాం, ఐతే ఈ టైటిల్‌ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార వాళ్ళకి నచ్చడంతో వారికి ఇచ్చాం.
ప్రస్తుతం ఏ సినిమా చేస్తున్నారు..??
లాక్డౌన్లో నేను ఇంట్లో ఉండడం వలన షాప్‌లో నాన్నకి హెల్ప్ చేసే వాడిని. ఐతే ప్రజల నుండి నేరుగా డబ్బు తీసుకుని వాళ్ళకి ఎల్లప్పుడూ సరుకులు ఇస్తూ సర్వీస్ చేస్తూ ఇంత రిస్క్ చేస్తున్న కిరాణా షాప్ వాళ్ళ కోసం మనం ఏదోటి చేయాలి, ఎలాగూ చిన్నప్పటి నుండి మా షాప్ లో నేను కిరాణా షాప్ లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు.ఇంకా అనుకున్నది తడువగా కిరాణా షాప్ వారికి కనెక్ట్ అయ్యేలా ''నమస్తే సేట్ జీ'' అనే కథను రాశాను. ప్రముఖ నటుడు, హీరో సునీల్‌తో ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. అలానే తేజా హనుమాన్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్లో శంకర్ కొప్పిశెట్టి నిర్మాతగా, నేను డైరెక్టర్‌గా ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. ప్రస్తుతం ఓటిటి/డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ అంటే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు కాబట్టి వారి అభిరుచికి తగినట్లుగా తీయడం మన బాధ్యత.
మీరు సినీమాలకు ఎలాంటి టాపిక్స్‌ని ఎంచుకుంటారు..??
నాకు బేసిగ్గా సోషల్ రెస్పాన్స్ అంటే బాగా ఇష్టం. ఎవరైనా ఏదైనా సమస్యలో ఉంటే నాకు తోచిన హెల్ప్ చేస్తుంటాను. కాలేజ్ డేస్‌లో సైతం ఫ్రెండ్స్‌తో కలిసి చందాలు వేసి మరి ఫండ్స్ కలెక్ట్ చేసే వాళ్ళం. ఆటోమేటిక్‌గా నాలో ఒక మూల సామాజిక దక్పథం ఉండిపోయింది. ప్రత్యేకంగా ఒక టాపిక్ అని కాదు, ఏం చేసినా కాస్త డిఫరెంట్‌గా ఉండాలి అనేది నా మార్క్. ప్రేక్షకులకు ఎల్లప్పుడూ వినోదంగా ఉంటూ ఒక సందేశాన్ని ఇచ్చేలా ఉండే సినిమాల్ని మాత్రమే ఎంచుకుంటున్నాను.
సినిమా ప్రారంభం నుంచి రిలీజ్ వరకు నిర్మాతకి, దర్శకుడికి టెన్షన్ టెన్షన్ ఉంటుంది.. అలాంటి పరిస్థితి మీకు ఎప్పుడైన ఎదురైందా..?
మంచి ప్రశ్న అండి..!! ప్రతి సినిమా ప్రొడ్యూసర్‌కి ,డైరెక్టర్‌కి ఈ సమస్య ఉంటుంది. సమ్ అమౌంట్ పెట్టి, డైరెక్టర్ చెప్పిన కథని నమ్మి ప్రొడ్యూసర్ ఒక సినిమాని నిర్మిస్తాడు.24 డిపార్ట్మెంట్ వ్యక్తులు బాగా ఇష్టపడి కష్టపడుతూ సినిమాని పూర్తి చేస్తారు. ఐతే పెద్ద సినిమాలైన్ 1 కోటి పైన ఉన్న సినిమాలు ,చిన్న సినిమాలైనా కోటి లోపు, ఎవరికయినా కామన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే. ఇంత కష్ట పడి సినిమా తిస్తున్నాం మరి సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందా.. లేదా అనేది ఉంటుంది.
కొన్ని సందర్భంల్లో మాత్రం అనుకున్న సమయంలో థియేటర్లలో మన సినిమా పడుతుందా లేదా, ఒక వేళ అప్పు తెచ్చి డబ్బులు పెడితే మాత్రం కనీసం పెట్టిన పెట్టుబడి వస్తుందా ..ఇలాంటి సమస్యలు మాత్రం ప్రతి సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్‌కి ఉంటుంది.
మీకు సినిమా ఫీల్డ్ లో ఇన్స్పిరేషన్ ఎవరు..?
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు, నా పుట్టినరోజు ఆగస్టు 22.సేమ్ డేట్ అవ్వడంతో చిన్నప్పటి నుండి మెగాస్టార్ అంటే చాలా ఇష్టం. తన కష్టపడే గుణం నాకు చాలా ప్రేరణగా ఉంటుంది. ఒక నటుడిగా నేను మెగాస్టార్ గారిని ప్రేరణగా తీసుకుంటాను. డైరెక్టర్‌గా మాత్రం రామ్ గోపాల్ వర్మ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. ఇంకా తనికేళ్ల భరణి గారు, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు, ధీరజ్ అన్న (దొరసాని, ఏబీసీడీ సినిమా కో ప్రొడ్యూసర్), డైరెక్టర్ మారుతీ సార్, కిశోరో దాస్, కమెడియన్ భద్రం, జబర్దస్త్ శాంతి స్వరూప్, డిస్ట్రిబ్యూటర్ శంకర్ కొప్పిశెట్టి, బేగంపేట ఏసీపీ నరేష్ రెడ్డి గారు, ఎల్బీనగర్ సీసీఎస్ సి.ఐ పార్థసారథి గారు, ఖమ్మం సి.ఐ అంజలి గారు, ఎస్.ఐ విజరు దేశిని, ఎస్.ఐ శ్రీనివాస్ శివనాథ్‌లు నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటూ, నా ప్రతి సినిమాకి సలహాలు, సూచనలు ఇస్తూ నన్ను ముందుకు నడిపిస్తూ నాలో ప్రతిభకి మెలకువలు దిద్దే వారు, వీరంతా నన్ను పరోక్షంగా పుష్ చేసే వ్యక్తులు.
- తేజస్వి పెద్దపల్లి