Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడుగడుగో తొలిపొద్దు తళుకు
బింబంలా ఉదయించేడు అన్నదాత!
జోడెడ్ల రథం మీద తలకట్టు
సింగంలా తరలి వస్తున్నాడు..
కమ్చీకర్ర చేతిలో ఝళిపిస్తూ
కాడెత్తుకొన్న బండెడ్లను
ఎలపట దాపట పిలుపులతో
అదిలిస్తూ తోలుకొస్తున్నాడు
భోగభాగ్యలు లేని భోజమహారాజులా
వెలుగును తలవెనక వేసుకున్నాడు
వందిమాగదులు లేని భూమాత
దత్తపుత్రుడిలా నేల తల్లికే తాను
అర్పణమయ్యేడు..
వేల సంవత్సరాలుగా అతడు
చిందించే స్వేదామతమే మన
అన్నానికి అంతఃసూత్రం!
బయట బండి పల్లకీ ఎక్కొచ్చి
ఇంట ఈగల మోతలో
ఇరుక్కుపోయాడు హతవిధీ!
అహౌరాత్రాలు అలుపెరుగక
శ్రమించి సమస్త ఆహారపంటలూ
పండించి కడుపు నిండా తిండి
ఎరగక ఆలుబిడ్డలతో అరక
దున్నించైనా సిరుల అరణాలు
పండించి పేరు నిలుపుకున్నాడు!!
- భీమవరపు పురుషోత్తం
9949800253