Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ వెలుగు రేఖ నింగి నుండి
నేలకు జారుతున్న వేళ...
రేయంతా కురిసి అలసి
ఆకులపై నిద్రించిన మంచు
మెల్లగా కరిగి పోతుంది...
మనసుపై కురిసిన తలపులు మాత్రం
వదలని గురుతులవుతుంటాయి
నీ రూపాన్ని కళ్ళల్లో పదే పదే చిత్రించుకుంటూ...
జ్ఞాపకాలు సంద్రమై పరచుకున్న వేళ
తలపుల కెరటాల్లో
మనసో అలసిన నావవుతుంది...
అపుడు...
మన మౌనాలు కూడా
మాట్లాడుకుంటాయేమో
నిన్నటి ఆ తీపి గుసగుసల ముచ్చట్లను...
ఆనందమో...ఆరాటమో...తెలియదు
వాలిన కనురెప్పల్లోని ఆ భావం....
కానీ నేస్తమా....
రెప్పల నుండి జారుతున్న
ఈ నిశ్శబ్దపు చినుకుల్లో మాత్రం
మన చరిత్ర మరోచరిత్రగా
కనిపిస్తుంటుంది....!!
- శాంతి కృష్ణ
9502236670