Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెలితలపుల కలహంసయె..వలచినట్లు ఉంది..!
మనసెపుడో తనసొంతం..అయ్యినట్లు ఉంది..!
వేదించే విరహానికి..తిలోదకా లెపుడు..
ఈ సమయమె నన్నిప్పుడు..కలచినట్లు ఉంది..!
తనకోసం ఏ గులాబి..ఉసురు తీయలేను..
పూలరుతువు తన పూజన..నిలచినట్లు ఉంది..!
మధువుకొరకు వెతుకులాడు..పనేముంది ఇపుడు..
శ్వాసలోన తనహాసం..నింపినట్లు ఉంది..!
కౌగిలించు ఈ వసంత..గాలికెంత దిగులు..
తనకోసం వేయికనుల..వేచినట్లు ఉంది..!
మాధవుడా చెలి ఊహల..పల్లకియే ఖైదు..
సమాధిలో నేనన్నది..చేరినట్లు ఉంది..!
- మాధవరావు కోరుప్రోలు
9866995085