Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆల్చిప్పలో పడితే
చినుకు ముత్యం
ఎన్ని చిప్‌లు పొదిగితే
ఒక కంప్యూటర్!
గుండె వేగం పెరిగింది
ఆనందంతో కాదు
అంతర్జాలం
నెమ్మదించినప్పుడే
గూగుల్‌లో
అన్నీ దొరుకుతాయి
ఆమె దుఃఖానికి
కారణం తప్ప
లెక్కలు నేర్పింది
క్యాలిక్యులేటర్జి
లెక్కలేనితనం చూపింది
కంప్యూటర్
సమస్యలపై పోస్ట్
ట్విట్టర్లో ట్రెండ్ అయ్యింది
పోరాటం
అక్కడే ఎండ్ అయ్యింది
- కుడికాల ''సరోజనార్ధన్'' వంశీధర్
9885201600