Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేస్తం..!! అనే తీయని ఆత్మీయ పలకరింపులో
చిరునవ్వుల మల్లెలు
పరిమళాలై ఒలుకుతాయి..
సిరివెన్నెల వలపులు
ప్రవాహాలై ఉరుకుతాయి..
సరిగమల పదనిసలు
పాటలై పలుకుతాయి..
నా ఎద కోవెలలో
కొలువైన ప్రియ నేస్తమా..!!
మాటలకందని మనసు నీది..
పలుకులకందని ప్రేమ నీది..
తెరలు లేని నీ మనసే.!
చెరగని చెలిమి చందనాలొలికే
ఓ అందాల నందనవనం..!!
ఓ నేస్తమా..!!!
నా నువ్వే! నవ్వై! పువ్వై!
పెదవి కొమ్మలో విరిసిన వేళా..
ప్రకతి అందాలే
నీ ఆకతి గంధాలౌతాయి..
ప్రతీ క్షణం గాలమేస్తూ
నా మనసు మీనాన్ని
సుతారంగా నీ వైపుకు లాగేసుకుంటావు..
మురిపెంగా లాలిస్తూ
నన్ను నీలో కలిపేసుకుంటావు..
ప్రేమ స్వరమై సాగి
స్నేహ గీతమై చేరి వెన్నంటే ఉండి
నా బ్రతుకులో
వలపుల వెన్నెల వాన
కురిపించిన నీకు తిరిగి ఏమివ్వగలను..??
నీ స్నేహ సంద్రంలో
మైత్రి ముత్యమై మెరిసిపోనా
నీ మానస సరోవరంలో
ప్రేమ కలువనై మురిసిపోనా..
నీ గుండె గూటిలో
వలపు గువ్వనై ఒదిగిపోనా..
నీ కంటి పాపలో
ప్రతి బింబమై చిరకాలం వెలిగిపోనా..!!!
- రేవంత్ స్వామి
94411 40238