Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతు
చమట చిందిస్తాడు
మొక్కను పోషించి
గింజలు పంచుతాడు
రైతు
కష్టంలో నష్టజీవి
రాశులు పోసినా
మెతుక్కు సరిపోదు
రైతు
వరి కుప్పకే రాజు
వెనకేసుకున్న
అప్పుల కుప్పకు కాదు
రైతు
ఆకలి తీర్చేవాడే కాదు
బాధల భారం
మోసేవాడు కూడా
రైతు
శ్రమ జీవుడే కాదు
లోకాన్ని పోషించే
అన్నదాత అతను
రైతు
నేడు నిరసనకారుడే
పరోక్షంగా
నీరసించినవాడు
రైతు
మట్టి మనిషే కాదు
చివరిదాకా వెంట నడిచే
తోడు కూడా
రైతంటే
పైరుకు కాపరి కాదు
కడుపు నింపే
ఆప్తుడు కూడా
- నరెద్దుల రాజారెడ్డి
9666016636