Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతికించుకున్న చిరునవ్వుతో
ఎన్ని హృదయాలను గెలువ గలవు
అందమైన అబద్దాలతో
ఎన్నాళ్ళు గోడల్ని కట్టగలవు
ఎక్కిన మెట్లనే చూస్తూవుంటే
ఏనాటికి గమ్యాన్ని చేరగలవు
ఒట్టి మాటల పడవనెక్కి
చేతల సముద్రాన్నెలా దాటగలవు
అడుగులేయడానికే అలసిపోతే
ఆఖరి మజిలీనెలా అందుకోగలవు
నిన్న ను మరిచిన నీవు
రేపటి వెలుగులెలా చూడగలవు
నటించడంలో జీవిస్తూ ఉంటే
బంధాలకు విలువనెలా అద్దగలవు
కలల లోకంలో సదా విహరిస్తూ
కాలాన్ని ఎలా అర్థం చేసుకోగలవు
మనిషిగా నిలబడలేని నువ్వు
మానవత్వ శిఖరమెలా ఎక్క గలవు!!
- వెన్నెల సత్యం
9440032210