Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిత్రమా!!
ఎలా కలిశావో తెలియదు,
ఎందుకు కలిశావో తెలియదు,
ఎప్పుడు కలిశావో తెలియదు,
నీవు కలిశాకే తెలిసింది,
నా మనసుకి ఓ మనసుందని...
అది మన స్నేహాన్ని చూసి మురిసిందని!!!
ఒకరి సంస్కారం తెలియాలంటే,
వారి మాట వినాలి,
ఒకరి ఆప్యాయత తెలియాలంటే,
వారికి దూరంగా ఉండాలి,
ఒకరి మనసులో స్థానం తెలియాలంటే,
వారికి కోపం తెప్పించాలి,
కానీ నిన్ను చూశాకే తెలిసింది...
అన్నీ నీ స్నేహం లో పరిపూర్ణంగా ఉన్నాయని!!!
అమ్మవు అయ్యి ప్రేమించావు,
నాన్నవు అయ్యి ఆదరించావు,
ఎల్లప్పుడూ నా తోడు ఉండి
నాలో ఆత్మగా అవతరించావు..
ఇంకా ఏమని చెప్పను మిత్రమా...
ప్రకతిలోని పంచభూతాల సాక్షిగా,
సాగరంలోని ప్రతి నీటి బిందువు సాక్షిగా,
పువ్వు లోని మకరందం సాక్షిగా,
మైమరచిపాడే కోకిల సాక్షిగా,
నేను ఇష్టపడే చంద్రుని సాక్షిగా,
నీ ఈ బంధానికి దూరంగా బ్రతకలేను...
నీతో కలిసున్న ఏ ఒక్క క్షణాన్ని వర్ణించలేను..
నీ ఈ స్నేహానికి వెల కట్టలేను...
ఏమని చెప్పి నీ ఈ రుణం తీర్చుకోగలను...
ఎన్ని జన్మలున్నా ఈ స్నేహం కోసమే జన్మిద్దాం...
పది కాలాలపాటు మన
ఈ స్నేహాన్నీ పదిలపరచుకుందాం మిత్రమా!!!
- జి.అభినయ
ట్రీపుల్ఐటీ, బాసర