Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాసానికోమారు మహావిందు
ఆకాశం నుండి దిగివస్తూ
మత్తెక్కించే చల్లనిచద్ది తెస్తూ
నెలరాజు మురిపెంగా వడ్డిస్తూ
గుటకలు సవ్వడితో
ఆబగా మింగేస్తూ చకోరాలు
వళ్ళంతా చుట్టేసుకుని
మురిసిపోతూ వనాలు
ముత్యపుచిప్ప అలలతో
ఆహ్లాదంగా సముద్రాలు
గంధపు చెట్లపై ఆనందంలో
మెరిసే మిన్నాగులు
ఎడారిలో ఇసుకతిన్నెలపై
చల్లగా మంద మారుతాలు
చిత్రమైన మాయలో
వెలుతురుతో విభేధించే
చీకటి రాత్రులు
ఆకాశంలో వన్నెలను
తను గణిస్తుంటే ,
తన కళ్ళలో
చిన్నెలను నేను గుణిస్తూ
మైమరచి పోతూ
నెమరువేసుకుంటూఏ
ఊహల్లో తేలిపోతూ
మళ్లీ వచ్చే పొర్ణమి
విందు వరకు
మిగిలిపోయాము!
ఆ చల్లనిచూపులో
ఏదో మత్తు,
ఇంకేదో గమ్మత్తు
ఉందని తలుస్తూ!
- ఉషారం
9553875577