Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీకు తెలుసు కదా!
నీవెంటే నీడలా నేనుంటానని
నీకు తెలుసు కదా!
నీ జ్ఞాపకాల నీడల్లో నేను బ్రతుకుతుంటానని..
నీవు నా చెంత లేని వేళ
ఏమీ తోచనితనాన్ని
వెంటేసుకుంటూ
నిరాశానిస్ప్రహల సంకెళ్ళలో
బందీయై పడి ఉంటానని
నీకు తెలుసు కదా!
ఎరుపెక్కిన
నా కనుల గులాబీలు
నీకై ఎదురుచూస్తుంటాయని
నిదురపోని రాత్రిలా
నేను నీకై వేచి ఉంటానని
నీ ప్రేమపుష్పం పూయకుంటే
నా ఎదతోట వికసించదని
నీ కంటి రెప్ప మూయకుంటే
నా కంటిపాప నిదురించదని
నీకు తెలుసు కదా!
దూరాన ఉన్నా -
నీ తలపులతో పిలుస్తూనే ఉంటావ్
నా ప్రేమ తలపులు
నీ దగ్గరికి చేరగానే
మనసు తలుపులు మూసేస్తుంటావ్.
నీ జాలిచూపులు నాకై జావళీపాడేదెప్పుడని ఆరాటపడుతూనే ఉన్నాను..
నీ కాలి అందె నా గుండెలో
సందడి రేపేదెప్పుడని తపిస్తూనే ఉన్నాను..
ప్రతి రోజు - వచ్చినట్టుగానే
నువ్వు ఏ రోజు వస్తావో
నా దగ్గరికి..
నువు రాకుంటే
గాలిని కూడా దగ్గరికి రానివ్వలేను
నీ ప్రేమను ఊపిరిగా చేసుకుని
జీవిస్తుంటాను..
నీవైన నేను..
మరి..నీవు నేనయ్యేనా?
అలక దుప్పటిని కప్పుకుని
చిరాకు చీకటిని చుట్టుకుని
చేసే ప్రయాణం ఇక చాలించవా?
తొలి వెలుగు నా ప్రేమ..
దరిచేరవా?
- తిరునగరి శరత్ చంద్ర
6309873682