Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎక్కడో తారాసపడతారు
చూపులు ఎప్పుడో కలుస్తాయి
మాటలు ఎలాగూ మొదలవుతాయి
నెంబర్స్ ఎక్చేంజ్ అవుతాయి
ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్టెడ్
వాట్సప్ చాటింగులు
మొబైల్ కబుర్లు
కాఫీడే భేటీలు
కార్నర్ సీట్ గుసగుసలు
లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ మెంట్స్
కాదు ప్రేమంటే...
ప్రేమలో ... ప్రామిసులుంటాయి
గిల్లికజ్జాలు...కోపతాపాలుంటాయి
బహుమతులు సర్వసాధారణం.
ప్రేమంటే.. ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాదు.. పెళ్లిచేసుకుని కూడా ప్రేమించవచ్చు. మరీ మాట్లాడితే ప్రేమికుల రోజును ముందుగా సెలబ్రెట్ చేసుకోవాల్సింది దంపతులే.. ఇంకా చెప్పాల్సివస్తే పెళ్లిరోజున ముందు ఎక్స్ ప్రెస్ చేసుకోవాల్సింది ప్రేమికులే. ప్రేమ పెళ్లిళ్లు ఎంత తీవ్రమో... పెళ్లి ప్రేమలు అంత పరిపూర్ణం. మాటల్లోనే కాక .. బతుకు లోను నిండుగా కలసి జీవించే, తోడుగా పయనించేదే కలకాలం నిలిచే ప్రేమకథ. నేడు మానవ సంబంధాలన్ని భౌతిక సంబంధాలు అవుతున్నాయి. అయితే ప్రేమ భౌతిక వస్తువు కాదు. ఇద్దరు వ్యక్తులూ ఒకే విధంగా ఆలోచించకపోవచ్చు. కానీ ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవడమే నిజమైన ప్రేమ. నిత్యం ఐలవ్యూ అని చెప్పుకునే కత్రిమ ప్రేమలు అవసరంలేదు. ప్రేమలో ఉన్నప్పుడే నా - నీ అనే భావన నుండి మన అనే అభిప్రాయానికి రావడమే నిజమైన ప్రేమ. పెళ్లి తరువాత ఇద్దరి .
ఆలోచనలు ఒక్కటవ్వాలి.
ఓ సాధువు మరణశిక్షతో చనిపోయే చివరి క్షణంలో .
రాసిన లేఖలో ఆఖరి సంతకమే
'' యువర్ వాలెంటైన్''.
నీ/మీ అన్న భావనతో రాసిన అక్షరాలు కాలక్రమంలో లక్షలకోట్ల గుండె చప్పుడును వినిపించే వీణానాదాలయ్యాయి. మూలం తెలియకపోయినా వాలెంటైన్ మరణించిన రోజు ప్రేమకు చిహ్నమైంది. తేదీలే కాదు.. రూపాలు కూడా మార్చుకుని ఫిబ్రవరి14 ప్రేమికుల దినోత్సవంగా ప్రపంచవ్యాప్తం అయింది. ప్రేమ నిరంతర ప్రవాహం. ప్రేమికులకు పెళ్లి లక్ష్యమైతే... దంపతులకు ప్రేమ గమ్యమవ్వాలి. నేడు ప్రపంచ ప్రేమికుల దినోత్సవమే కాదు ... ప్రపంచ పెళ్లిల దినోత్సవం కూడా.. ప్రేమలో పడి పెళ్లితో జంటగా మారిన మన తెలుగు
సినీ జంటల చిరు పరిచయమే ఈ వారం జోష్..
ఓ అందమైన అబ్బాయి... ఓ అపురూపమైన అమ్మాయి. వీరిద్దరి మతాలు వేరు.. ఇద్దరి భాషలు వేరు.. ఇద్దరి ప్రాంతాలూ వేరు. కానీ... ఇద్దరూ ప్రేమించుకున్నారు! రోజులు.. వారాలు.. నెలలు.. సంవత్సరాలు తేదీలు మారేకొద్దీ ఆ బంధం బలపడుతూనే ఉంది ఒకరితో ఒకరు.. ఒకరి కోసం ఒకరు అన్నట్టు బతికారు! కలిసి తిరిగారు.. కలలు పంచుకొన్నారు. ఇంట్లో కూడా పచ్చజెండా ఊపేశారు. ఇంకేముంది... ఇక పెళ్లే!
కాజల్ - గౌతమ్
బిజినెస్ మ్యాన్ అయిన గౌతమ్ కిచ్లు బిజీగా ఉంటూనే కాజల్ మనసును కూడా దోచేసాడు. 2010లోనే తమ ప్రయాణం మొదలైందని చెప్పుకొచ్చింది కాజల్. అప్పట్నుంచే ఇద్దరం టచ్ లో ఉన్నాం.. ఒకరినొకరు తెలుసుకోవడానికి ఇన్నేళ్లు పట్టిందని చెప్పింది కాజల్. పదేళ్ళ పరిచయం కాస్తా ఆ తర్వాత ఏడేళ్లుగా స్నేహంగా మారిందని.. ఆ తర్వాత మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్నామని చెప్పింది. తమ ప్రేమకథ సినిమాల మాదిరి మలుపులు తిరగలేదని చెప్పింది కాజల్. ఒకరికొకరం నచ్చడంతో ఇంట్లో చెప్పామని.. ఆ తర్వాత తెలుసుకుని పెళ్లి చేసుకున్నామని చెప్పింది కాజల్. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు చేస్తున్నపుడే తనకు కాబోయే మిస్టర్ పర్ఫెక్ట్ ను కూడా ఎంచుకుంది. 'వివాహం తమ జీవితాన్ని ఎంతో అద్భుతంగా మార్చిందంటుందీ కొత్త జంట. వత్తిపరమైన జీవితాల్లో ఎప్పుడూ బిజీగానే ఉండే ఈ జంట. ఇంటికి రాగానే మిగిలిన విషయాలను మర్చిపోయి సరదాగా గడపాలని నిర్ణయించుకున్నారు. ''మా పెళ్లి కార్డులపై 'కిచ్డ్' అనే పేరే వాడాం. దాంతో ఇటీవల మేము ప్రారంభించిన హౌమ్ డెకోర్ బ్రాండ్‌కు కూడా అదే పేరు పెట్టామని కాజల్ తెలిపింది.
రానా - మిహీకా
రానా పెద్ద చెల్లెలు అశ్రిత, మిహీకా క్లాస్ మేట్స్. దీంతో రానా, మిహీకా ఎప్పటి నుంచో పరిచయం ఏర్పడింది. అయితే లాక్ డౌన్ కు కొన్ని రోజుల ముందే తమ మధ్య ప్రేమ చిగురించింది. మిహీకా నార్త్ ఇండియన్ అయినా చిన్నప్పటి నుంచి హైదరాబాదులోనే పెరిగింది. ముందుగా తాను ప్రేమిస్తున్నాననే విషయాన్ని ఫోన్ ద్వారా మిహీకాకు తెలియజేశాడు రానా. ఆ తర్వాత ఆమె తనను కలిసిందని.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనంతరం ఈ నిర్ణయాన్ని ఇరుకుటుంబాలు సంతోషంతో స్వాగతించాయని రానా తెలిపాడు.
ఎనిమిదేళ్ల ప్రేమ ప్రయాణం
కొందరు కామన్ ఫ్రెండ్స్ ద్వారా 2012లో షాలినితో పరిచయం. మొదట కొన్ని నెలలు స్నేహితులుగానే ఉన్న వీరిద్దరూ.. ఒకరి అభిరుచులు ఒకరికి నచ్చడంతో పాటు మనస్తత్వాలు కలవడంతో పరస్పరం ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. షాలిని గురించి నితిన్ మాటల్లో.. 'నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. సినిమారంగంలో ఉన్నవారు ఎప్పుడూ బిజీగా ఉంటారు. వ్యక్తిగత జీవితానికి సమయం ఎక్కువగా ఉండదు. ఇవన్నీ తెలిసి కూడా షాలిని ప్రతి అడుగులో నాకు మద్దతుగా నిలిచింది. కెరీర్ విషయంలో ఎంకరేజ్ చేసింది. ఈ ఎనిమిదేళ్లలో మా మధ్య అప్పుడప్పుడు చిన్న మనస్పర్థలు తలెత్తాయి. ఆ సందర్భాల్లో షాలిని చొరవ తీసుకొని నన్ను శాంతింపజేసేది. అందుకే ఆమె అంటే నాకు అంత అభిమానం' అని తెలిపాడు.
నిఖిల్ - పల్లవి
ఒక పార్టీలో బెంగుళూరులో మెడిసిన్ చేస్తున్న పల్లవిని చూడగానే ప్రేమ పుట్టిందని అన్నాడు నిఖిల్. దాన్నే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారేమోనని, మేమిద్దరం తరుచూ మాట్లాడుకొనడంతో తన జీవితం ఆమె తోనే ముడిపడిఉందని అనిపించి, తన పేరెంట్స్ తో చెప్పడంతో అంగీకరించారు. ''అర్జున్ సురవరం' చిత్రం విడుదల డిలే కావడంతో మేమిద్దరం ఇంకా దగ్గరయ్యాం. దీంతో గోవాలో పల్లవికి ప్రపోజ్ చేశాను.ఆమె అంగీకరించి తన పేరెంట్స్ తో మాట్లాడమందని, సినీ కుటుంబ సంబంధం అనగానే పల్లవి పేరెంట్స్ . సందేహపడ్డారు. తన తల్లి వారి సందేహాలను తీర్చడంతో వారు పెళ్ళికి అంగీకరించారు. సెప్టెంబర్ 3 తన సతీమణి పల్లవి వర్మ పుట్టిన రోజు సందర్భంగా ఆమెతో దిగిన ఓ పిక్
షేర్ చేస్తూ స్పెషల్‌గా విష్ చేశాడు నిఖిల్. ''హ్యాపీ బర్త్ డే వైఫీ.. నువ్వెప్పుడైతే నా లైఫ్ లోకి ఎంటరయ్యావో.. అప్పటి నుంచి అంతా ఆనందమయంగానే ఉంది'' అంటూ నిఖిల్ తన భార్యపై ఉన్న ప్రేమను మరోసారి బయటపెట్టాడు. పల్లవి తనతో ఎంతో అణకువగా మెదులుతోందని, ఆమె వచ్చాక జీవితం మరింత హాయిగా మారిందని పేర్కొన్నాడు. ప్రేమలో మునిగితేలి పెళ్లి బంధంతో ఒక్కటైన నిఖిల్- పల్లవి జోడీ ప్రస్తుతం ఈ లాక్డౌన్ విరామ సమయాన్ని జాలీగా గడుపుతోంది
కులమతాలకి అతీతంగా...
ఇద్దరం చదువుకున్నది ఒకే కాలేజీ అయినా ఇద్దరికీ పెద్దగా పరిచయం లేదు . నాలుగేళ్ళూ పక్క పక్క డిపార్ట్మెంట్లోనే ఉన్నా నాలుగు మాటలు కూడా మాట్లాడుకోలేదు. ఎవరు మాత్రం
ఊహించి ఉంటారు తర్వాత మేమిద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటాము అని..? ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఇద్దరికీ ఒకే కంపెనీ లో ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్ లో మూడు నెలలు ట్రైనింగ్ జరిగింది. ఆ ట్రైనింగ్ సమయంలో మంచి స్నేహితులము అయ్యాము. అప్పుడు కూడా మాకు ప్రేమ, పెళ్లి అనే ఊహే లేదు.నా పోస్టింగ్ బెంగళూరులో.. తనది హైదరాబాద్. దూరంగా ఉన్నా మా స్నేహం అలాగే నిలబడింది. సెలవు దొరికినప్పుడల్లా తనని కలవడానికి హైదరాబాద్ వచ్చేవాడిని. సినిమాల పట్ల నాకున్న ఇష్టం, ఆ రంగంలో నిలబడటానికి నేను చేస్తున్న ప్రయత్నాలు అన్నీ తను మొదటి నుంచి గమనిస్తూనే ఉంది. వాటికి ఎంతో మోరల్ సపోర్ట్ ఇస్తూ వచ్చింది. నన్ను ఇంత బాగా అర్థం చేసుకునే అమ్మాయి మళ్ళీ నాకు దొరుకుతుందో లేదో అని నాకు ఒక రోజు అనిపించింది. తనతో కలిసి జీవితం పంచుకుంటే బాగుంటుందని.. ఒకరోజు ధైర్యం చేసి తననే అడిగేసాను. ''నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది.'' అని చెప్పేసాను. తను కొన్ని రోజులూ ఆలోచించుకుని గ్రీన్ సిగల్ ఇచ్చింది. ఇద్దరి మతాలు వేరు కాబట్టి పెద్ద గొడవ అవుతుందేమో అని కొంచెం కంగారు పడ్డాము. కానీ మా ఇద్దరి పేరెంట్స్ చాలా పెద్ద మనసుతో మమ్మల్ని అర్థం చేసుకుని పెళ్ళికి అంగీకరించారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ ఆనందంగా గడుపుతున్నామని చెప్పారు మిడిల్ క్లాస్ మెలోడిస్ చిత్రం యువ దర్శకుడు వినోద్ అనంతోజు.
- మోహన్ అనంతోజు