Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విరిసిన పూల కొమ్మను ఊపినట్టు
ఆ పూరేకులన్నీ నాపై రాలినట్టు...
మెత్తని నీ చిరునవ్వులని గుత్తంగా నాపై రువ్వావు....!!
వానజల్లై చిలిపిగా నిత్యం నీ
తలపులతో హదయాన్ని తడిపేస్తుంటావు
మధుకానివై హదయంలో పదిలంగా నిండావు
నీ కనుల కవ్వింపులను కాంచినంతనే
అధర సుధలను కోరెనే
మధురముగా నా మనస్సు...
కాలాలు మారినా కనులు వెతికేది నీకోసమే!!!
మాటలే కరవైన మౌనాలు మనసంతా నిండెనులే....
కనుపాపలా కళ్లలో కొలువుండిపోయావిలా....
మోమున ఏదో వింత కాంతి విరిసెనే
నీ సాహచర్యంలో....
స్వేచ్ఛగా..శాంతిగా..ప్రేమగా....
మదినిండా ఉప్పొంగెనే అలలై అనురాగం....
- లక్ష్మీ సుధ