Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కంచె దాటిన గొర్రె పిల్ల
మల్ల కంచెలోకి కాలు వెడుతలేదు...
సోయి దప్పి తిరుగుడు నేర్సింది గదా!
గొర్రె పిల్ల అదొక్కటే గట్లయిందనుకుంటే
దాని జతకు ఇంగిన్ని
మోపు జేసుకున్నది...
అది ఉన్నవి లేనట్లు
లేనివి ఉన్నట్లు
మొత్తుకుంట గాయి గాయి జేస్తున్నది...
మధ్యలెవరో ఇంత మరుగుమందు వెట్టినట్లున్నరు
వోళ్ల పేర్లనే కూత వెడుతున్నది...
మందు వెట్టినోళ్లు
సందు దొరికినప్పుడు
దీని తోలు గూడా వొలుస్తరన్నది యాదిమర్సింది...!
- కెపి లక్ష్మీ నరసింహ