Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్భయ, అభయ, దిశలాంటి
చట్టాలెన్ని రూపులద్దుకున్నా ...
మానభంగ పర్వాలు ఆగలేదు
మరింతగా విస్తరిస్తున్న వైనం
షీ టీమ్, సి.సి కెమెరాలెన్ని
నిరంతరం కాపు కాస్తున్నా ...
మానవ మగాళ్ల చేష్టలుడగలేదు
ఇంకా వ్యవస్థీకతమౌతున్న తీరు
నగరం నడిబొడ్డున చదువుల తల్లిపై
రేప్ ఘటన విస్తుగొల్పలేదు సరికదా !
నిత్యం ఓ తంతుగా మారిన తరుణం
ఏడు దశాబ్దాల స్వేచ్ఛా భారతంలో...
గడియకో పసిమొగ్గ రాళ్తున్న విషాదాలు
పూటకో అబల బలవుతున్న విదశ్యాలు
అంతరించు విలువలకు సజీవ సాక్ష్యాలు
స్త్రీ పూజించబడే పుణ్య భూమిలో...
కామోన్మాద కత్తులు మొలుస్తున్నాయి
స్వేచ్ఛగా నదయాడే పవిత్ర దరిత్రిలో...
రాక్షస రాబందులు తచ్చాడుతున్నాయి
ఆకాశంలో సగం అన్న నినాదం
నింగి నంట హౌరెత్తించుట తప్పా !
ఆచరణ మాత్రం అందనంత దూరాలు
ఇకనైనా.. అలసత్వం వీడి
అతివకు ఆలంబనగా నిలుద్దాం ...
ఆత్మీయ ''హస్తం'' అందించుదాం ...
ఆత్మవిశ్వాసం పెంపొందించుదాం
వ్యవస్థలో కలుపు మొక్కల వేరేద్దాం ...
స్వేచ్ఛాయుత ''పూబాటలు'' పరుద్దాం
(అతివలపై అత్యాచార ఘటనకు అక్షర నిరసన తెలుపుతూ.....)
- కోడిగూటి తిరుపతి,
9573929493