Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె...
సృష్టి ప్రతీకం
విశ్వ వికాసం
శక్తి స్వరూపం
ఆ హాసం జీవన నాదం
ఆ వదనం నిర్మల సధనం
ఆమె...
మాతత్వపు వరం
దాతత్వపు పరిమళం
ఆ మది మమతల మడి
ఆ హది మానవతల గుడి
ఆమె...
సహన శిల్పం
సౌహార్ద శిఖరం
ఆ ఒడి చల్లని సంద్రం
ఆ సడి శ్రావ్య సంగీతం
ఆమె ...
ఇల వెలసిన దైవత్వం
నడయాడే మూర్తిమత్వం
ఆ అడుగు వెన్నెల బాట
ఆ జీవితం త్యాగాల తోట
ఆమె...
తపఃశ్వి ...
మహా మనీషి ...
ఆ సహనత్వం ఆజరామరం
ఆ వ్యక్తిత్వం అనిర్వచనీయం
ఆమె...
తల్లిగా మనకు పురుడు పోస్తుంది
తనయగా ఆత్మీయత పంచుతుంది
సోదరిగా అనుబంధం పెంచుతుంది
సహధర్మచారిగా సర్వం దారబోస్తుంది
ఆ త్యాగ ధాత్రిని...
గౌరవ వందనం సమర్పిద్దాం
ఆ పుణ్య మూర్తికి...
శిరస్సు వంచి ప్రణమిల్లుదాం
(మార్చ్ 8న అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా అతివకు అక్షర హారతి పడుతూ..)
- కోడిగూటి తిరుపతి,
9573929393