Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గడపే దాటదనుకున్న ''ఆమే''
ఇప్పుడు గగనంలో విహరిస్తుంది
సవాళ్ళతో సహజీవనం చేస్తూ
సమాజపు పురోగమంలో
సమ్మోహనశక్తిగా మారుతుంది
తన ప్రతిభను ప్రపంచానికే
అంకితమిస్తుంది
చాకలి పద్దులకే పరిమితం
అనుకున్న ఆమె చదువు
ప్రపంచ గమనాన్ని తిరగరాస్తుంది
సహజ సులక్షణ సమ్మేళనాలైన
ఓర్పు, నేర్పు, సహనాలతో
మానసికంగా మనోధైర్యాన్ని
మేధో సంపన్నతలో ఉన్నతస్థితిని
బాధ్యలకు అనుగుణంగా శారీరక
దఢత్వాన్ని పెంపొందించుకుంటూ
తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది.
పురిటి నొప్పులనే కాదు
అనాగరిక సమాజపు తప్పుల్ని కూడా
సమర్ధవంతంగా ఎదుర్కొంటూ
ఆ ''మహిళే'' ఇప్పుడు
''మహారాణి'' గా విరాజిల్లుతుంది.
- యం యస్ రాజు
9502032666