Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లోకంలో లోపమెక్కడుందో
లోలోపల రోజు మధనం
లోకుల ఆలోచనల్లో పాతుకుపోయిందేదో
పుట్టపగలాలిపుడు విషపురుగులు చేసే
అన్యాయాలాకత్యాలన్నీ
నిత్యసత్యాలై సాగుతున్నరు
అంతం లేనేలేదిక్కడ
ఎక్కడచూసినా ఆడబిడ్డలానదిగా అణగదొక్కబడుతూనేవున్నరు
ఆవిరైపోతున్నరు
నీచంగా నికష్టపు జీవనవికాసగమనంలో
గతితప్పిన జీవితాలు
సత్యమేందో
పరిష్కారం దొరకనేదొరకదు
అన్యాయపు అరణ్యంలో
నోట్లోమాటలు రానేరావెవ్వరికి
అగ్నిపరీక్షలు వారికెపుడు నైవేద్యాలు
పరువుమర్యాదలన్నీ పడతులకే
అన్యాయానికి వారసులౌతున్నరు
అక్కడ ఇక్కడ ఎక్కడైనా
నింగికి నేలకు మధ్యలో
నిలువెల్లా దహించుకుపోతున్నరు
విజ్ఞానమెంత వికసించిన
సమాదానం దొరకని ప్రశ్నైంది
అంతరిక్షంలో అడుగుపెట్టిన
కడుపులోనే కడతేరుస్తున్నరు
కుటుంబమే కదా
ఆమెనెపుడు మానసికంగా
శారీరకంగా సామాజికంగా
బలహీనురాలుగా ముద్రేస్తుంది
చేతకానితనాన్నద్ది పోషిస్తుంది
అడుగులు నేర్పేటపుడే
గుండెల్లో భయాన్నింపుతరు
ఆధాపడడమే అలవాటుగా తీర్చిదిద్దుతారు
తల్లిదండ్రులు కొడుక్కోన్యాయం
కూతురుకు మరోన్యాయాన్ని
చూపిస్తే
సమాజం సమన్యాయం చూపెడుతుందా..?
కుటుంబమే నేర్పాలి
మాట పాట ఆట వేట
దేనికి భయపడని మనస్తత్వం
దేనికి వెనుకాడని నిర్భయత్వం
దేన్నైనా ఎదుర్కొనే ధైర్యం
పోటీతత్వం పోరాటతత్వం
అన్నింటిలో ముందుండేలా
నడవవలసినదారులన్నీ నక్షత్రాలై విరిసేలా
ఇ...ప్పు...డు
యుగయుగాల నియంత్రిత కంచె తొలగించండి
నవోదయకాంతులు
బతుకంతా పండించుకోనియండి
పారిపోవడానికి కాదు
ఎదురుతిరగడానికి
వెన్నెల వెలుగుపూలు తోరణాల తొడిగేలా చెదరని చేయుతనివ్వండి
జీవితం చైతన్యం నిండిన సుందరదరహాసమయ్యేలా
(అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా)
- సి. శేఖర్(సియస్సార్)
9010480557