Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సస్యశ్యామలమైన
నా దేశంలో
ముళ్లపొదలు మొలుస్తున్నాయి
శాంతియుతమైన నా దేశంలో
అశాంతి పవనాలు వీస్తున్నాయి
కష్టజీవులుండే
నా దేశంలో
సోమరులు నిండిపోతున్నారు
దొరలుగ బతకాల్సిన వాళ్ళు
దొంగలుగ మారుతున్నారు
న్యాయంగా ఉండాల్సిన వాళ్ళు
అన్యాయాన్ని సహిస్తున్నారు
నీతివైపు
నిలబడాల్సిన వాళ్ళు
అవినీతికి పాల్పడుతున్నారు
సత్యం మాట్లాడే వాళ్ళుల
నోరు తెరవడం మానుకున్నారు
మంచి వైపు వెళ్ళడం
మాని చెడును ఆశ్రయిస్తున్నారు
అన్నం తినడం మానేసి
గుట్కాలను మింగుతున్నారు
నీళ్లు తాగడం మరచిన వాళ్ళు
మద్యంతో గొంతు తడుపుతున్నారు
ఆలిని ఏలుకోమ్మంటే
అక్రమ సంబంధాలతో
కాలం గడుపుతున్నారు
కాలేజీకి వెళ్లడం మానేసి
ప్రేమ పేరుతో కాలక్షేపం చేస్తున్నారు
ఓట్లతో గెలిచిన వాడ్లు
నోట్ల కోసం దేశాన్ని అమ్మేస్తున్నారు
ఇంతకీ ఏమైంది నా దేశం?
ఎటు పోతుంది నా రాజ్యం?
తలచుకుంటేనే భయమేస్తుంది
ముచ్చెమటలతో
గుండె ఆగినంత పనవుతుంది!!
- జవేరియా,
9849931255