Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజాన్ని నేర్వడానికి
జీవన పోరును జయించాలంటే
చదువు మన '' చనువు '' గావాలే
మాటలు గొంతు దాటి
నివురుపట్టిన నెత్తుటోలె ఎగిసిపడాలి,
గుండెల్లో మేకులై దిగిన
'' ఆక్రోదనను '' చూపుడువేలై సూపాలంటే
గురువులు మార్గదర్శకం గావాలే
విద్యాసంస్థలు తోవలై నిలబడాలి
కానీ ఇప్పటి వ్యవస్థ
మాటల్ని గొంతు దాటనివ్వకుండ
అనిగి మనిగి బతికే
జీవనాన్ని నేర్పుతున్నరు
పిల్లలకి ప్రశ్నించేతత్వం నేర్పండి.,
జాలు వారే జనంలో
కష్టాన్నైనా చెప్పుకునే దైర్యం వస్తది,
సక్కిల పడిపోయే
మూగ ''మూలుగు'' కాదు
సమాజంతో
మార్పు ఎలా పొందాలో నేర్పండి.,
వంద మందిలో నవ్వుల పాలు కాకుండా
వాన్ని వాడైన కాపాడుకుంటడు
గంటలు కూసోబెట్టి
బలిమిట్టికి సదివించే సదువులు కాదు..?
గుంజిపట్టి నిలదీసే గొంతును,
సౌండ్ బాక్సులయ్యేలా మార్చండి.,
కనీసం..., వాడన్న
వ్యభిచార సంకెళ్లు వదిలి బతుకుతడు..
రాసే రాతలు నేర్పండి..
బాధలను సీరా చుక్కలు చేసి
నినాదాలుగా మారుస్తాడేమో..?
అంతేగానీ..
నాకెందుకు అనే వేశ్యతత్వం కాదు.,
ఎది చెప్పిన తలదించుకునే
బానిసత్వం కాదు
ఒక్కడివే నీ సమస్యకి
సమాధానం వేతుక్కో..
అని చెప్పండి.,
నింగికి నీడలా ఉంటడు
అందరి కోసం అనే దానిలో
పాములాటలు నేర్పండి.,
రెప్పపాటులోజి
ఏ కాటు కౌగిలిలోనైనా.,
తన్లాడే ధైర్యం ఉన్న
మనుసున్నొడైయితడుజి
మాట్లాడే విధానం నేర్పండి
చెప్పే సమాధానంలో
తల దాచుకున్న
నిజాన్నైనా..
పైకి తెచ్చిపెడుతడు
నటనలో పేరడీలు కాదు చూపేది
పాడే పాటల్లో గజల్స్ ని,
పోరాడే పురిటినొప్పుల
అరుపులని వినిపించండి.,
అరుపులంచున ఎండుగడ్డై
మండే నిప్పుకి తోడైతడు
పసిగట్టే పసరు పట్టించండి
మీ యాజమాన్యంలో జరిగే
చీకటి కోణాల మిరుగులకు
పాషమై కూసుంటడు
ఆయువుపట్టులాంటి ఆవేశాన్ని నేర్పండి..
అంతెరుగని ఆకాశాన్ని
అలవోకగా ఆకళింపు చేసుకుంటడు
ఆనందంలో ఆత్మాభిమానం నేర్పుండ్రి
బాధలోని సుకుమారానికి
స్వేచ్ఛగా బంధి అయితడు
జగత్తుకు జీవనాన్ని నిలుపాలంటే
జనాల గుండెళ్ళో
కూసంత ధైర్యాన్ని
నేర్పుండ్రి సారు..!
- తాళ్లపల్లి శివకుమార్
9133232326