Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనుషుల్ని ఖాళీ
చేసి వెళ్ళిపోయింది
ఖాళీ అయిన మనుషులు
ఇల్లుని వెతుక్కుంటూ
వెళ్తున్నారు
దారిలో
ఇల్లు గుర్తొచ్చింది
ఇంటిముందు అలికి ముగ్గేసుకున్న
దృశ్యం గుర్తొచ్చింది
ఆప్యాయంగా తలనిమిరిన ఫ్యాన్
గుర్తొచ్చింది
ఆకలై గ్యాస్ మీద ఉడుకుతున్న అన్నం
గుర్తొచ్చింది
చుట్టూ అల్లుకున్న చీకట్లో 12 రూపాయల
కరెంట్ బుగ్గ గుర్తొచ్చింది
గుర్తుల మీద గుర్తులు
గ్యాస్ మీద పాలుపొంగినట్టేపొంగుతూనే ఉన్నారు
అరచేతులమీద నిప్పుల్ని పోసుకున్నంత
నొప్పుల్ని భరిస్తూనే ఉన్నాడు
మనిషిని ఖాళీ చేసిన
ఇల్లుని వెతుక్కుంటూ
మనిషి దుఃఖంతో బరువైపోతున్నాడు.
- పేర్ల రాము