Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మట్టిలోనుండి కడుపునింపే పంటలను తీయడం తెలుసా?
కార్పొరేట్ కందిరీగలకు
కంటికి కనిపించిన ప్రతీదీ ఆక్రమించడం తప్ప!
నింగి నేల అనే తేడా లేనిలేదు
సమస్తం వారే!!
ఇందుగలడందు లేడను సందేహం వలదన్నట్టుగా
సందులో సడేమియల్లా దూరిపోతున్నరు
ఆక్రమించడానికి కాదేది అనర్హం అనేలా అన్నింట్లో
పెట్టుబడిదారుల పెత్తనమే!
ఎన్నుకున్న సర్కారు సైతం
వారికే వత్తాసు పలుకుతున్నరే!
కానీ రైతన్న
గోచిపెట్టి పొలంలో దిగాడంటే
అలుపెరుగని సూర్యడై నేలమ్మను చందమామలా ముస్తాబుచేస్తడు
ఆకలిని మరచి చెమటనంతా ధారపోస్తూ కలోగంజో తాగి
పట్టువదలని పనితనంతో పచ్చదనాన్నద్దుతడు
ఎక్కడున్నా తన మనసంతా సేద్యంపైనే
పంటచేలను
పసిపిల్లల లాలనలా గారభంగా చూసుకుని మురిసిపోతడు
పంట చేతికొచ్చేవేళ ఎదిగిన బిడ్డలా ఎదకత్తుకుంటడు
తూర్పారబట్టాక సంచుల్లో ఎత్తిన రైతు
తన కష్టానికి ఆనందభరితుడౌతడు
దళారులకు పంటనమ్మేప్పుడు
బిడ్డను అత్తారింటికి పంపినట్టు సింగారించి సాగనంపుతూ...
పుట్టెడు దుఃఖంతో కష్టాల కడలిలోకడుగేస్తడు
వాడికేం తెలుసు రైతుల కష్టం నష్టం
రైతుల్నంతా నేడు రోడ్లపైకి లాగిన ఘనత
నేటి అధి నాయకత్వంచేసిన
నయ నయవంచక చట్టాలే
తిండిగింజలపై పెత్తనాన్ని
పెట్టుబడిదారులకు ధారదత్తం
పేద మధ్యతరగతి జీవితాలు
ఆకలిని కొనుక్కునే దుస్థితి
రైతుల ఉద్యమం నీరుగారిపోతుంటే
ఏ ఒక్కరు తమ గళాలను ఎత్తడం లేదెందుకో?
ఏ నాయకుడు సామాన్యలకు అండగా నిలవడమేలేదు
పంటచేలే దేశ సంపద
రైతే దానికి సష్టకర్త
రైతును రాజును చేయొద్దు
పడిపోకుండా నిలబెడితే చాలు
ఆకలిని అందఃకారంలో వెతుకులాడొద్దు
మెతుకులన్నీ అద్దాలమేడల్లో
అందనంత ఎత్తులోకి నెట్టే
చట్టాలకు సమాదికట్టి
సామాన్యులను రక్షించండి
- సి. శేఖర్(సియస్సార్),
9010480557.