Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏమి త్యాగం చేశావని ...
ఈ దేశం మీద ''ద్వేషం'' నీకు ?
ఏమి సమర్పించావని ...
ఈ వ్యవస్థపై ''అక్కసు'' నీకు ?
స్వీయ శ్రేయస్సు కోసం
నినతం తండ్లాట తప్పా!
సాటి మనిషి బాగుకు తపించావా ?
ఊహల పల్లకిలో ఉరేగుట తప్పా
వాస్తవ దక్పదంతో అడుగేసావా ?
అంతరాల ఆధిపత్యం తప్పా
సమైక్య జీవన దశ్యం కలగన్నావా
ఏమి ఆశించకుండానే
ఈ గాలి ,నీరు,నిప్పు నింగి నేలలు
సకల జీవులకు ఆధరువౌతున్నరు
నోరులేని జీవ ధాతువులే
త్యాగాలకు నిలయమైనపుడు
బుద్ది జీవివైన నువ్వెందుకు
సంకుచితాల నెలవవుతావు ?
ఇప్పటికైనా ...
నీ పుట్టుకకు సార్థకత చేకూర్చ
ఈ పుణ్య భూమి రుణం కాస్త తీర్చ
ఉన్నత విలువల దిశగా అడుగేరు
విశ్వ ప్రాణుల శ్రేయస్సు కాంక్షిస్తూ
విశాలత్వ బీజం అంకురింపజేరు
సమైక్య జీవన పంటలు పండించేరు
అప్పుడే విశాల జగతి
సశ్య శ్యామలమై విలసిల్లేది
ఈ మానవ జాతి
సమైక్య గీతికలు పల్లవించేది
ఈ విశాల జగతి
సశ్య శ్యామలమై విలసిల్లేది
- కోడిగూటి తిరుపతి
9573929493