Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలపుంత
హరివిల్లు అందాలను అద్దుకుని
నేలమీదికి దిగొచ్చినట్లు..
భానుడి కిరణాలు
విద్యుదావేశాలుగా సంఘర్షించి
కాంతులు వెదజల్లినట్లు..
పర్వత సానువులనుండి
పిల్ల తెమ్మెరలు వీచినట్లు..
కొండలు తెల్లని
మంచుపరదాలు కప్పుకున్నట్లు..
నీ అందాల
మోహపు గంధమేని కూర్పు..
పిల్లతెమ్మెరల
వసంతరాగాల మేళవింపు..
నీప్రణయపు
ఉద్వేగాల మోహరింపు..
సంభ్రమ సమ్మోహనమే కదా !
సఖీ ! నిన్ను గీసిన సష్టికర్త
ఎంత గొప్ప చిత్రకారుడు..
నీకేం తెలుసు ?
నిశీరేలో నీ కోసం నేనెన్ని సార్లు
కలత నిదురతో నిదురిస్తున్నానో !!
- అశోక్ అవారి,
9000576581