Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనుకుంటాం కానీ అన్నీ
అనుకున్నట్టు జరగవు
కనుల మాటున దాగిన కలను
కంట నీరే కడిగేయాల్సి రావొచ్చు
గుండె చాటు దాగిన ప్రేమను
గుండెల్లోనే సమాధిచేయాల్సి రావొచ్చు
ఆప్యాయత నిండిన మాటల్లోనే
అనుచిత వ్యాఖ్యలు వినాల్సి రావొచ్చు
అపురూపంగా పెంచుకున్న మొక్కను
అన్యాయంగా పెకలించాల్సి రావొచ్చు
అనురాగాన్ని పంచాల్సిన అమ్మే
అమానుషంగా బిడ్డను బికారిగా మార్చాల్సి రావొచ్చు
ఆలంబనగా నిలవాల్సిన స్నేహితుడే
అంధకారంలోకి నెట్టేయాల్సి రావొచ్చు
క్షణమొక రీతిగా మారుతున్న లోకంలో
మంచితనపు ముసుగులు
పెదవులపై కత్రిమ నవ్వులు
మాటల్లో కొనితెచ్చుకున్న మర్యాద
నడతలో అతి వినయం
ఇవన్నీ ప్రదర్శించాల్సి రావొచ్చు.....
- సునీత పేరిచర్ల
8309420900