Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నీ ప్రేమ వ్యవహారం ఎక్కడి దాకా వచ్చిందిరా..?' ప్రసాద్‌ని అడిగాడు ఫ్రెండ్.
'ఇంకెక్కడి ప్రేమా..!' అంటూ బావురుమన్నాడు ప్రసాద్.
'ఏమైంది?' దగ్గరికి తీసుకుని ఓదార్చుతూ అడిగాడు ఫ్రెండ్.
'మా మధ్య బ్రేకప్ అయ్యింది' చెప్పాడు ప్రసాద్.
'ఎందుకు..ఎలా..?' అడిగాడు ఫ్రెండ్.
చెప్పడం మొదలెట్టాడు ప్రసాద్..
'ఆమె బర్త్‌డేకు విష్ చేయడానికి ఫోన్ చేశా.
గిఫ్ట్ ఏం కావాలో చెప్పమని అడిగా.
తన వయసు ఎంతుందో ఊహించి అన్ని గులాబీ పూలు పంపమని చెప్పిందామె.
వెంటనే పూల వ్యాపారికి ఫోన్ చేసి 20 గులాబీలు ఆర్డర్ ఇచ్చా.
వాటిని ఆమె అడ్రస్‌కి పంపమని చెప్పా.
అలా పంపడమే నా తప్పయ్యింది.
గిఫ్ట్ చూడగానే ఆమెకు కోపం వచ్చింది.
వెంటనే బ్రేకప్ చెప్పేసింది..' ఘోల్లుమన్నాడు ప్రసాద్.
'ఆమె అడిగినట్టే గులాబీలు పంపావు కదా! ప్రాబ్లం ఎక్కడొచ్చింది?'
విషయం అర్థంకాక అడిగాడు ఫ్రెండ్.
'ఆమె ఏజ్‌కి తగ్గ సంఖ్యలో నేను 20 పూలు ఆర్డర్ ఇస్తే.. నా మీద అభిమానం కొద్దీ
ఆ వ్యాపారి ఇంకా 10 పూలు ఎక్స్ట్రా ప్యాక్ చేసి పంపాడట. అదే నా కొంప ముంచింది' విలపిస్తూ చెప్పాడు ప్రసాద్.