Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వానొచ్చినప్పుడల్లా
తనే గుర్తుకొస్తుంటుంది
మబ్బుల్లో జారిపడ్డ చినుకులా
తను నా గుండెలో చొరబడుతుంటుంది
చినుకు చినుకు మట్టి తడిసి ముద్దైనట్లుగా
ఆమె ఊహల్లో నేను తడిసి తడిసి ముద్దవుతుంటాను
చినుకులన్ని కల్సి వాగులు వంకలై పారినట్లుగా
ఆమె జ్ఞాపకాల్లో నేను ప్రవాహమై సాగిపోతుంటాను
ఆమె పలుకులు నా గుండెలో
ముత్యపు చినుకులై స్వరాల్ని కురిపిస్తుంటాయి
ఆమె చూపులు నా మదిలో
విరిసిన మందారాలై ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి
ఎందుకో..
ఇప్పుడు వాన లేదు
నాలో ఆమె లేదు..!!
-బిల్ల మహేందర్, 9177604430