Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్తగా ఉద్యోగంలోకి చేరాలనుకున్నప్పుడు లోలోపల భయం, అక్కడి వాతావరణం ఎలా ఉండబోతుందనే టెన్షన్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. అవి పటాపంచలు కావాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే.
- ఆఫీసుకు వెళ్లగానే మీ బాస్, సహోద్యోగులందర్నీ పరిచయం చేసుకోండి. ఫీల్డ్‌వర్క్ అయితే వారిని కలవడానికి ప్రత్యక్షంగా వీలుకాకపోవచ్చు. ఇంటర్నల్ సోషల్నెట్వర్క్ ద్వారా అయినా మీ గురించి తెలియజేయండి.
- ముందుగా మీ కంపెనీ ప్రధాన సేవలు, ఉత్పత్తులు, లక్ష్యాల గురించి తెలుసుకోండి.
- సంస్థ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనండి. అయితే ఎక్కడా అత్యుత్సాహం ప్రదర్శించొద్దు.
- విధుల్లో భాగంగా మీకు ఎలాంటి సందేహం తలెత్తినా వెంటనే సీనియర్లను అడిగి నివృత్తి చేసుకోండి. మొహమాటానికి పోయి మౌనంగా ఉండిపోకండి.
- సహోద్యోగులందరితో సఖ్యతగా మెలగండి. ఉత్తమ బాంధవ్యాలను నెరపండి. భవిష్యత్తులో అవన్నీ పనికొస్తాయి.
- వారానికి, నెలకోసారి మీ పనితీరు గురించి మీ బాస్ ద్వారా ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. మీ బలాలు, బలహీనతలను తెలుసుకుని ఒక అంచనాకురండి. అవసరమైతే పనితీరును మెరుగుపరుచుకోండి. స్వభావాన్ని మార్చుకోండి.
- కంపెనీ యాజమాన్యం అడిగినప్పుడు మాత్రమే సంస్థ అభివృద్ధికి అవసరమైన సలహాలు ఇవ్వండి.
- ఆఫీసులో పని వాతావరణాన్ని దెబ్బతీసే సంభాషణలకు తావివ్వకండి. అనవసరమైన గాసిప్స్, పాలిటిక్స్ జోలికి అస్సలు వెళ్లొద్దు.