Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితం సవ్యంగా సాగాలంటే సమయపాలన అవసరం. దైనందిన చర్యల్లో ఇదెంతో కీలకం. ముఖ్యంగా యువత భవిష్యత్తు దీనితోనే ముడిపడి ఉంటుంది. టైమ్ సెన్స్ ఉన్న వారికి సమస్యలు ఆమడ దూరంలో ఉంటాయని అంటున్నాయి అధ్యయనాలు. ఆహారం, విద్య, వినోదం, విలాసం, విశ్రాంతి, విధులు.. ఇలా అంశం ఏదైనా సమయపాలనకు కచ్చితంగా ప్రాధాన్యతనివ్వాల్సిందే.
చాలామంది విద్యార్థులకు సమయానికి నిద్రపోయే అలవాటు ఉండదు. రాత్రంతా చదువుకుని తెల్లవారే ముందు పడుకుంటారు. పొద్దెక్కిన తర్వాత లేస్తారు. హడావుడిగా నిద్రలేచి రెడీ అయ్యి కాలేజీకి వెళ్తుంటారు. ఇది ఏమాత్రం సరికాదంటున్నారు పరిశోధకులు. నిద్రపోయేందుకు స్థిరమైన సమయాన్ని పాటించకపోతే చదువులో వెనకబడిపోతారని హార్వర్డ్ కాలేజీకి చెందిన విద్యార్థులపై చేసిన పరిశోధనలో తేలింది. అధ్యయనంలో భాగంగా 61 మంది విద్యార్థుల నిద్ర సమయాన్ని 30 రోజులపాటు పరిశీలించారు. రోజూ ఒకే సమయానికి నిద్రపోయే విద్యార్థులను, సమయపాలన పాటించని విద్యార్థులను రెండు బ ందాలుగా విభజించారు. వారికి 0 నుంచి 100 రేటింగ్ ఇచ్చారు. సమయపాలన పాటిస్తూ నిద్రపోయిన విద్యార్థులు చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి 100 స్కోర్‌కి చేరువుగా ఉన్నారని గుర్తించారు. సమయపాలన పాటించకుండా నిద్రపోయినవారు మాత్రం బాగా వెనుకబడినట్టు గమనించారు. క్రమ సూచిలోని 10 పాయింట్ల గణనలో విద్యార్థి జీపీఏ 0.10 సగటు పెరుగుదలను కనుగొన్నారు.